
నవతెలంగాణ- మల్హర్ రావు: వచ్చేది కేసీఆరే, అభివృద్ధి చేసేది పుట్ట మధే అని బీఆర్‌ఎస్ మహిళ అధ్యక్షురాలు పంథకానీ చంద్రకళ, సోషల్ మీడియా ఇంచార్జి అక్కినేని సుమన్ అన్నారు. మంథని ఎమ్మెల్యే గా పుట్ట మదుకర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని శుక్రవారం మండలంలో ఎడ్లపల్లి గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అభివృద్ది సంక్షేమం పుట్ట మధూకర్‌తోనే సాధ్యమవుతాయనన్నారు.కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎవరూ చేయలేని సాహసం చేశారని, కరోనా మృతులకు దగ్గరుండి గౌరవంగా అంత్యక్రియలు చేసి, ఇటు ప్రభుత్వపరంగా అటు తన సొంతంగా అనేక సేవలు అందించారని, రాబోయే రోజుల్లో సైతం పుట్ట మధూకర్ ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రభుత్వ పథకాలతో పాటు తన సొంతంగా మరిన్ని గొప్ప సేవలు అందిస్తారని చెప్పారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల కన్నీళ్లు కష్టాలు పట్టించుకుంటారని, పేదోడి ఆకలి తీర్చాలనే ఆరాటం ఉన్న గొప్ప సేవకుడు పుట్ట మధూకర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మంథని బాపు, అక్కినవేని రాధ శ్రీనివాస్, తోట స్వరూప రమేష్, పుట్ట మధు యువసేన మండల అధ్యక్షులు పిలమరి నరేష్ నాయకులు తోట సత్యనారాయణ, మంథని బుచ్చయ్య, తోట రాజ సమ్మయ్య, వేల్పుల రాజేందర్, కుక్కల రాజబాబు, కునారపు శ్రీనివాస్, జనగామ రాజేష్, మరియు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.