అర్జున్, జె.డి చక్రవర్తి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘ఇద్దరు’. డి.ఎస్.రెడ్డి సమర్పణలో ఎఫ్ ఎస్ ఎంటర్టైన్మెంట్స్ పై ఎస్ ఎస్ సమీర్ దర్శకత్వంలో మహమ్మద్ ఫర్హీన్ ఫాతిమ నిర్మించారు. ఈ సినిమా ఈనెల 18న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత డి ఎస్ రెడ్డి మాట్లాడుతూ, ‘ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి క్వాలిటీతో తీసిన సినిమా ఇది. ప్రేక్షకులందరూ ఈ సినిమా చూసి మంచి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ సమీర్‌కి కృతజ్ఞతలు. అర్జున్, చక్రవర్తి నాకు చాలా సపోర్ట్ చేశారు. ఇందులో ఓ మంచి పాత్ర చేశాను. అది మీ అందరికీ బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని హీరోయిన్ సోని చరిష్ట చెప్పారు. నిర్మాత, దర్శకుడు సమీర్ మాట్లాడుతూ, ‘మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రసన్న కుమార్, రామకృష్ణ గౌడ్, జేవిఆర్, రవి, డిఎస్ రెడ్డికి కృతజ్ఞతలు. ఈ సినిమాని మంచి మంచి లొకేషన్స్‌లో, హై క్వాలిటీలో చేశాం. అర్జున్, చక్రవర్తి పోటీ పడి మరీ నటించారు. హీరోయిన్స్‌గా రాధిక కుమారస్వామి, సోనీ చాలా బాగా నటించారు. కళాతపస్వి కె. విశ్వనాథ్‌కి ఇది చివరి సినిమా. అమీర్ ఖాన్ తమ్ముడు ఫైజల్ ఖాన్ కూడా నటించారు’ అని తెలిపారు.