ఇది  ఏమనుకుంటున్నారు.. క్రీడా మైదానం

నవతెలంగాణ – సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఒకే ఒక క్రీడా మైదానం ఉంది. అదే ఇది… ప్రస్తుతం చూసిన ప్రతి ఒక్కరు నవ్వుకునేలా ఉంది. అసలు విషయం ఏంటంటే… ఈ క్రీడా మైదానం కు గత ప్రభుత్వం రెండు కోట్లు వెచ్చించింది. 50% పైగా నిధులు ఈ మైదానం కు గత ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రస్తుతం ఈ మైదానం బురద గుంత గా కనిపిస్తుంది. పట్టణంలో క్రీడా మైదానం ఒక్కటే ఉండడంతో ప్రతి ఒక్కరు ఈ మైదానంలోనే పలు రకాల క్రీడలు ఆడుతుంటారు. అంతేకాకుండా అనేకమంది ఈ క్రీడా మైదానంలోనే ఉదయం, సాయంత్రం వాకింగ్ చేస్తారు. అన్ని రకాలుగా ఉపయోగపడే ఈ క్రీడా మైదానం ప్రస్తుత ఈ పరిస్థితుల్లో ఉంది అధికారులు దృష్టి సారిస్తే బాగుంటుంది.