రాష్ట్రంలో సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు ఒరిగిందేమిటి?

– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టు కార్మికుల పట్ల వివక్ష విడనాడాలి
  నవతెలంగాణ-మణుగూరు
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సింగరేణి కాంట్రాక్టు కార్మికులు తమ వేతనాలను కోల్పోయి ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ సింగరేణి యాజమాన్యం కానీ కాంట్రాక్టు కార్మికులకు చేసింది ఏమీ లేదు. జేబీసీసీఐలో చేసిన నిర్ణయాలను సింగరేణిలో అమలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం బొగ్గు మంత్రిత్వ శాఖ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఫలితంగా కాంట్రాక్టు కార్మికుల జీవితాలలో ఎలాంటి మార్పు రావడం లేదు. వారి సమస్యలు పరిష్కారం కావడం లేదు. సింగరేణి నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేలకోట్ల రూపాయలు తమ ఖాతాలో వేసుకున్నాయి. ఎమ్మెల్యేలు కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. కాంట్రాక్టు కార్మికుల శ్రమతో అధికారులకు అవార్డులు వస్తున్నాయి. రకరకాల ఉత్సవాల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఉత్పత్తి సాధన, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అధికారులకు పర్మినెంట్‌ కార్మికులకు సీట్లు పంచుతున్న సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టు కార్మికులకు స్వీట్లు కూడా ఇవ్వకుండా వివక్షత పాటిస్తున్నది. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అయినా ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని సింగరేణి యాజమాన్యం స్పందించాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నైనా సింగరేణి కాంట్రాక్టు కార్మికుల గురించి ఆలోచించాలని వారి వేతనాలు పెంచాలని ఇతర సమస్యలు పరిష్కారం పై ప్రకటన చేయాలని కోరుతున్నారు. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచుతామని 2018 ఎన్నికల సందర్భంగా రామగుండంలో శ్రీ కేటీఆర్‌, సింగరేణి ఎన్నికల సందర్భంగా కవిత (నాడు ఎంపీ, డిజిబికేఎస్‌ గౌరవ అధ్యక్షులు) కొత్తగూడెంలో హామీలను ఇచ్చిన విషయాన్ని తమకు గుర్తు చేస్తున్నామన్నారు. 2022 సెప్టెంబర్‌ 26న సింగరేణి యాజమాన్యం జీవో 22 అమలు అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేక పై నేటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించని విషయాన్ని తెలియచేశారు. తెలంగాణలో అతిపెద్ద రాష్ట్ర ప్రభుత్వ రంగ సింగరేణిలో నేడు సుమారు 25వేల మంది కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారని బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి సాధిస్తున్న లాభాలలో సమస్త అభివృద్ధిలో కాంట్రాక్టు కార్మికులు శ్రమ రక్తం ఉన్నాయి కాంట్రాక్టు కార్మికులు లేకుండా సింగరేణి ఒక్కరోజు కూడా నడవదు సింగరేణి అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు చెల్లించడంలో కోలిండియా ఇండియాలో ఒప్పందాలను అమలు చేయడంలో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అన్ని విభాగాల కాంట్రాక్ట్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలి అప్పటివరకు నేరుగా వేతనాలు చెల్లించాలి. కాంట్రాక్టు కార్మికుల పట్ల వివక్ష విడనాడాలి. కోల్‌ ఇండియా వేతనం అమలు చేయాలి లేదా జీవో నెంబర్‌ 22 గేజి టు చేసి అమలు చేయాలి. జీవో నెంబర్‌ 22 అమలు కోసం సింగరేణి యాజమాన్యం 26-9-22 నా రాష్ట్ర ప్రభుత్వానికి రాసినలేకపై స్పందించాలి. ప్రమాదంలో మరణించిన కాంట్రాక్టు కార్మికులకు హౌల్‌ ఇండియా చెల్లించిన విధంగా రూపాయలు 15 లక్షలు ఎక్స్గ్‌ గ్రేషియా ఇవ్వాలి. సింగరేణిలో లాభాల వాటా లేదా చట్ట ప్రకారం 20 శాతం బోనస్‌ చెల్లించాలి. సింగరేణి హాస్పిటల్‌ లో కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయం కల్పించాలి. కాళీ క్వార్టర్స్‌ కాంట్రాక్టు కార్మికులకు కేటాయించాలి. జాతీయ పండగ అర్జత సెలవులు అమలు చేయాలి కేటగిరి ఆధారంగా వేతనాలు చెల్లించాలి. పెండింగ్‌లో ఉన్న అన్ని విభాగాల కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.
దశాబ్ది ఉత్సవాల్లో కాంట్రాక్ట్‌ కార్మికులను భాగస్వాములు చేయాలి
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు గద్దల శ్రీనివాసరావు
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో కాంట్రాక్ట్‌ కార్మికులను భాగస్వామ్యం చేయాలి. రెగ్యులర్‌ కార్మికులతో పాటు కాంట్రాక్ట్‌ కార్మికులకు కూడా స్వీట్లు పంపిణీ చేయాలి. ఖాళీగా ఉన్న క్వార్టర్స్‌లను కాంట్రాక్ట్‌ కార్మికులకు ఇవ్వాలి బొగ్గు ఉత్పత్తిలో కాంట్రాక్ట్‌ 65 శాతం ప్రాధాన్యత ఉంటుంది. లాభాల బోనస్‌లో కూడా కాంట్రాక్ట్‌ కార్మికుల వాటాలు ఇవ్వాలి, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు కార్మికుల శ్రమతో నిర్మించిన కంపెనీ కోటర్స్‌లను ప్రభుత్వ ప్రజా ప్రతినిధులకు యాజమాన్యం ఇస్తుంది. భాగస్వాములైన కాంట్రాక్ట్‌ కార్మికులను విస్మరించడం సరైనది కాదు.