నిరుద్యోగ భృతి ఏమైంది..

నవతెలంగాణ- డిచ్ పల్లి
బీఅర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అందజేస్తామని చెప్పిన హామీ ఏమైందని ఇందల్ వాయి బీజేపీ మండల అధ్యక్షులు నాయిడి రాజన్న అన్నారు.గురువారం మండల కేంద్రం లోని బస్టాండ్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి హైదరాబాద్ లో నిరసన దీక్ష చేపడ్తే నిరసన చేయకుండా అరెస్టు చేయడం హేయామన్నారు.ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నీరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వకుండా తన ఇంట్లోనే ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులకు మొండి చేయి చూపారని విమర్శించారు. ఈ కార్యక్రమం లో మండల ప్రధాన కార్యదర్శి  సక్కి లక్ష్మీ నారాయణ, కిసాన్ మోర్చా అధ్యక్షుడు కొత్త జనార్దన్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు జగత్ సింగ్, బీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి జేల్లెల్ల శ్రీనివాస్, ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు సట్ల సుదర్శన్, నవీన్ రెడ్డి, రవి, కిషన్, సాగర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.