జైలుకు వెళ్లి వచ్చిన నాయకులు క్రైమ్ రేట్ పెరిగిందని సమావేశం పెట్టి చెప్పడం ఏంటి 

What if the leaders who went to jail hold a meeting and say that the crime rate has increased– అభివృద్ధి చేసి చూపిస్తాం 

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
జైలుకుపోయి వచ్చిన నాయకులు క్రైమ్ రేట్ పెరిగిందని మీడియా సమావేశం పెట్టి చెబుతూన్నారు అని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెల్ఫేర్ వర్గాల ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ..దానికి కారణం కూడా వారే ఒక మహిళ అయి ఉండి లిక్కర్ వ్యాపారం చేసి అందరిని తాగుబోతులుగా మార్చి క్రైమ్ రేట్ పెంచింది ఎవరని ప్రశ్నించారు. మేము గాలి మాటలు మాట్లాడమని అభివృద్ధి మాత్రమే చేసి చూపిస్తాం. ఈరోజు నిధులు తీసుకోవచ్చాం అభివృద్ధి చేసి చూపిస్తాం అన్నారు.నిజామాబాద్ ప్రజలందరికీ తెలుసు గుట్కా దందా చేసేవారు ఎవరో  ఇసుక దందచేసే వారెవరు అక్రమ బియ్య ము వ్యాపారం చేసేవారు ఏ పార్టీ వారో ప్రజలందరికీ తెలుసు అన్నారు. నిజామాబాద్ పట్టణ అభివృద్ధి కొరకు టి యు ఎఫ్ ఐ డి సి(TUFIDC) నిధులు 60 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారితో ప్రత్యేకంగా మాట్లాడి నిధులు మంజూరు చేయించాను. పట్టణంలోని దాదాపు అన్ని డివిజన్లకు డ్రెయిన్ సీసీ రోడ్లు,కల్వర్టులు,  పట్టణ అభివృద్ధి కోసం టి యు ఎఫ్ ఐ డి సినిధులు మంజూరు చేయించడం జరిగింది. నేను మాటలతో అభివృద్ధి చేయను చేతలతో అభివృద్ధి చేసి చూపిస్తా అనే ఈ సందర్భంగా తెలియజేశారు.రాష్ట్ర ప్రభుత్వం ఒక సంవత్సర కాలంలో 55 వేల ఉద్యోగాలు ఇచ్చాం ఇంకో 50,000 ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. బిజెపి నాయకులు మాటలు చెబుతారు గాని అభివృద్ధి చేయరు.ప్రధాని నరేంద్ర మోడీ సంవత్సరానికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఎన్ని ఇచ్చాడు ప్రతి ఖాతాలో 15 లక్షలు నల్లధనం వేస్తానని ఎంతమందికి వేశాడు.దేశాన్ని దోపిడీ చేసి పారిపోయిన ఎగవేత దారులను దేశానికి తిరిగి తెప్పిస్తానని ఎంతమందిని తీసుకొచ్చావు.దేశాన్ని దోచి ఆదాని, అంబానీలకు  పెడుతున్నావ్ ప్రపంచం మొత్తం అదాని డిఫాల్ట్ ర్ అంటుంటే నీవు నోరు ఎందుకు మెదపడం లేదు. బిఆర్ఎస్ ప్రభుత్వం మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రాన్నిగా మార్చి 8 లక్షల కోట్లు అప్పు చేశారు. ఈ రోజు రైతులకు రుణమాఫీ కాలేదు అంటూ గగ్గోలు పెడుతున్నారు.మీరు అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లో రుణమాఫీ ఎంత చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే దఫా రెండు లక్షల రుణమాఫీ చేసి 21వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేసాం మిగతా వారికి కూడా చేస్తాం. సంక్రాంతి కి రైతు భరోసా కూడా అందజేస్తాం.ప్రభుత్వం నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లును సాంక్షన్ చేసింది. రాష్ట్రం మొత్తం 25 లక్షల నిరుపేదలకు ఇల్లు అందిస్తున్నము. దానికోసం 12వేల 500 కోట్లు నిధులు విడుదల చేస్తున్నాం. దానికోసం ప్రత్యేకమైన యాప్ ను విడుదల చేసి దాంట్లోనే అందరూ అప్లై చేసు కోవాలి ఇందిరమ్మ ఇండ్లకు సర్వే కూడా మొదలుపెట్టాం. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం
ఆరు గ్యారెంటీల్లో అన్ని అమలు చేసాం ఎన్నికల్లో హామీ ఇచ్చిన దానికంటే ఎక్కువగానే అమలు చేసాం అని అన్నారు.