
– నష్టపోతున్న రైతన్నలు
నవతెలంగాణ – మల్హర్ రావు
పంట సాగుపై రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రతియేటా నిర్వహించే రైతు చైతన్య యాత్రలు నాలుగేళ్లుగా నిర్వహించడం లేదు.దీంతో పంటలపై రైతులకు అవగాహన కొరవడింది. నకిలీ విత్తనాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు,భూసార పరీక్షలు,ఏపంటలు వేయాలి, అధిక దిగుబడి సాధించేందుకు మెలకువలపై అవగాహన కల్పించకపోడంతో రైతన్నలు నష్టపోతున్నారు నాలుగైదు రోజుల్లో వానాకాలం సాగు ప్రారభం కానుండగా ప్రభుత్వం రైతు చైతన్య యాత్రల గురించి ఎలాటి చర్యలు తీసుకోవడం లేదు.మండలంలో 15 గ్రామపంచాయతీల పరిధిలోని 22 రెవెన్యూ గ్రామాల్లో ఖరీఫ్ సాగులో 24 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయునున్నట్లుగా వ్యవసాయ అధికారులు అంచనా వేశారు.వరి 16,000, పత్తి 3,500, మిర్చి 2,500, ఇతర పంటలు 1500 ఎలారాల్లో సాగుచేయునట్లుగా అంచనా వేశారు.వీటికి యూరియా,డిఎపి,కాంప్లెక్స్,ఎంవోపి తదితరులు ఎరువులు 6,890 మెట్రిక్ టన్నుల అవసరం ఉంటాయని పేర్కొన్నారు.
గతంలో అవగాహన సదస్సులు..
గతంలో పంటలకు తెగుళ్లు సోకి రైతులు నష్టపోయారు.అయితే అప్పటి ప్రభుత్వం మన తెలంగాణ.. మన వ్యవసాయం పెరిట చైతన్య యాత్రలు నిర్వహించి రైతులకు వ్యవసాయ, పశు సంవర్ధక శాఖ, విద్యుత్ శాఖ అధికారులతో సదస్సులు నిర్వహించేవారు.అయితే అవి ఇప్పుడు కనుమరుగైయ్యాయి.రైతులు మార్కెట్ లో నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి పంట మార్పిడి చేసుకోక భూసార పరీక్షలు చేసుకోక నష్టపోయిన దాఖలాలున్నాయి.గతేడాది మండలంలో పెద్దయెత్తున నకిలీ విత్తనాలు నాటి అవి మొలకెత్తక దాదాపు 150 ఎకరాల్లో పంటలు నష్టపోవడం జరిగింది.నకిలీ విత్తనాలు మొలకెత్తక,ఇతర పంటలు సాగు చేసుకోవాల్సి వచ్చింది. రైతు చైతన్య యాత్రలు నిర్వహించి, నకిలీ విత్తనాలు ఎలా గుర్తించాలో వాటిపై అవగాహన కల్పించకపోవడంతో రైతులు నష్టపోతున్నారు.ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు,ప్రభుత్వం గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి రైతులను చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది.
సూచనలు పాటించాలి.. అత్తె సుధాకర్ ..మండల వ్యవసాయ అధికారి
గతంలో మన తెలంగాణ.. మన వ్యవసాయం పేరిట రైతు చైతన్య యాత్రలు నిర్వహించడం జరిగింది.ప్రస్తుతం అలాంటివి నిర్వహించడం లేదు.గ్రామాల్లో అందుబాటులో ఉండి రైతు వేదికల్లో రైతులకు అవగాన నిర్వహించడం జరుగుతుంది.సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, నకిలీ విత్తనాలపై అవగాహన కల్పిస్తున్నాం.