కేసీఆర్‌ లక్ష్యం ఏంటి?

What is the goal of KCR?రాకింగ్‌ రాకేష్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘కేశవ చంద్ర రమావత్‌’ (కేసీఆర్‌). గ్రీన్‌ ట్రీ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీకి గరుడవేగ అంజి దర్శకత్వం వహించారు. అనన్య కృష్ణన్‌ కథానాయిక. రాకింగ్‌ రాకేష్‌ స్వయంగా నిర్మించిన ఈ చిత్రం లంబాడీ వర్గానికి చెందిన యువకుడి రియల్‌ లైఫ్‌ నుంచి స్ఫూర్తి పొందింది. మేకర్స్‌ శనివారం చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా హీరో రాకింగ్‌ రాకేష్‌ మాట్లాడుతూ,’ఈ సినిమాని మూడు ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించాలని నా కోరిక. దర్శకుడు సాయి రాజేష్‌కి ఎంత థ్యాంక్స్‌ చెప్పుకున్న తక్కువే. డైరెక్టర్‌ అంజి సినిమాని చాలా ప్యాషన్‌ తో తీశారు. చరణ్‌ అర్జున్‌ అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చారు. నా సక్సెస్‌కి కారణం నా భార్య సుజాత. ఈ జర్నీలో చాలా సపోర్ట్‌ చేసింది’ అని తెలిపారు. ‘రాకేష్‌ అద్భుతమైన కథ రాశారు. సినిమాటోగ్రఫీ, డైరెక్షన్‌ రెండు నేనే చేశాను. ఈ సినిమాకి చరణ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌తో పాటు లిరిక్స్‌ రాశారు. కొన్ని పాటలు పాడారు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, సాంగ్స్‌ అన్ని హైలైట్‌ అవుతాయి. హీరోయిన్‌ అనన్య చాలా ఫెంటాస్టిక్‌గా నటించింది’ అని డైరెక్టర్‌ అంజి చెప్పారు.
‘హృదయ కాలేయం’ ఆడియో ఫంక్షన్‌కి రాకేష్‌ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా స్కిట్‌ చేసి వెళ్ళాడు. ఆ కృతజ్ఞత నాకు అలా ఉండిపోయింది. తనకి కెరీర్‌లో బెస్ట్‌ క్యారెక్టర్‌ రాస్తానని మాట ఇచ్చాను. తొందరలోనే ఆ క్యారెక్టర్‌ రాసి రుణం తీర్చుకుంటాను. ట్రైలర్‌ చాలా బావుంది. ఈ సినిమాతో రాకేష్‌ మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్‌ అంజి మంచి దర్శకులు, కెమెరామెన్‌. అర్జున్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ చాలా బాగుంది.
– డైరెక్టర్‌ సాయి రాజేష్‌