– బీఆర్ఎస్ మండలాధ్యక్షులు కొత్త రవీందర్ రావు
నవతెలంగాణ – ఉప్పునుంతల: నూతన ప్రభుత్వము 6 గ్యారెంటీ ల పేరుతో ప్రజలతోటి కుటుంబ సభ్యుల వివరాలు తీసుకోవడం జరుగుతుంది కానీ నూతన తెలంగాణ ఏర్పడ్డ కొన్ని రోజులకే అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతి కుటుంబానికి సకుటుంబ సర్వే చేయించి ప్రతి కుటుంబంలో ఉన్న వివరాలు తీసుకోవడం జరిగింది. అప్పటి పూర్తి వివరాలు అన్ని ఆన్లైన్ లో ఉన్నా గాని మళ్లీ కావాలి అని చెప్పి ప్రజలను మభ్య పెట్టడానికి ప్రతి గ్రామం నుండి మళ్ళీ జిరాక్స్ ల పేరుతో ఆధారాలు తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు తీసుకున్న కుటుంబ సర్వే రిపోర్ట్స్ తీసుకున్న డేట్ నుండి 18 సంవత్సరాల వరకు పనికొచ్చే విధంగా కేసీఆర్ ఆరోజు ఆన్లైన్లో నమోదు చేయడం జరిగింది కానీ మరి ఇప్పుడు ప్రజల నుండి వివరాలు తీసుకోవడం ఇది సమాజసం కాదు ఆధార్ కార్డు నెంబరు పాస్ బుక్ నెంబరు కుటుంబం ఉండే సభ్యులు, ఉద్యోగస్తులైన గాని వారి అన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరిగినది అప్పటినుండి ఇప్పటివరకు నూతనంగా ఎవరైతే జన్మించినవారైతే వారి డీటెయిల్స్ ఇస్తే సరిపోతది కానీ ఈరోజు పెద్ద మొత్తంలో ఏదో చేస్తున్నమని చెప్పేసి గొప్పల కొరకు ప్రజలను ఇంత హింసించడం సరికాదని చెప్పేసి ఈ మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోరడం జరుగుతుంది ఇదివరకే ఇస్తామన్న రైతుబంధు ఇంతవరకు ఇవ్వలేదు ఆసరా పింఛన్లు ఇవ్వలేదు ప్రజలు అయోమయంలో ఉన్నారు. కనుక దాన్ని వృద్ధులు వాటితోనే జీవనోపాధి కొనసాగిస్తూరు కనుక పింఛన్లు త్వరలో చెల్లించలి అదేవిధంగా వ్యవసాయ నాట్లు వేసుకున్న టైం వచ్చింది ఇంతవరకు రైతుబంధు పైసలురాలేదు రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.
నాటు కోవడానికి కూలీలకు పైసలు డీఏపీ బస్తాలకు పైసాల్ లేవు కనుక వారికీ కూడా త్వరగా ఇచ్చే విధంగా చూడాలి అదేవిధంగా ఏ ఒక్కరి వద్దా ఇప్పుడు తీసుకున్న అప్లికేషన్లు బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతలేరు మరి ఏ విధంగా వారికిపతకాలు పంపిణీ చేసి పైసలు అకౌంట్ లో ఎస్తారా లేకపోతె నగదు పంపిణీ చేస్తారని అని కూడా ప్రజలలో అయోమయంగా ఉంది దాని మీద కూడా స్వష్టత రావాలని చెప్పేసి కోరుచున్నాము నూతన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 100 రోజుల్లో చేస్తామని చెప్పేసి చెప్పిన ఈ ఆర్ గ్యారంటీలో వంద రోజుల్లో పూర్తి చేయాలని చెప్పేసి బి ఆర్ఎస్ పార్టీ తరఫున కోరడం జరుగుతుంది. ఎవరైతే గ్రామాలలో అప్లికేషన్ పూర్తి చేసి ఇయ్యాల అనుకున్న వారికి ఒక రెండు రోజుల ముందే అప్లికేషన్ పారాలు ఇస్తే వాళ్ళు నిప్పుకొని సమన్వయంగా మొత్తం క్లిష్టంగా రాసుకొని వచ్చి గ్రామపంచాయతీలో మీరు ఏర్పాటు చేసిన కౌంటర్లో ఈయడానికి చాలా వీలుగా ఉంటుంది కనుక ప్రతి గ్రామానికి రెండు రోజుల ముందే అప్లికేషన్ ఫామ్ పంపిణీ చేయాలని చెప్పి కోరడం జరుగుతుంది ఇందులో ఏమాత్రం రాజకీయ కోణం లేకుండా ప్రతి ఒక్కరికి అరులైన వారికి పథకాలు అందే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలని చెప్పేసి కోరుచున్నాము ఏమాత్రం ఇందులో రాజకీయ కోణం ఉన్నా గాని మీరు ఇచ్చిన ఆరు పథకాల డిక్లరేషన్ మీద న్యాయస్థానాన్ని గాని లేకపోతే అధికారుల మీద కలెక్టర్ గారివద్దకు గాని సమస్యలు వారి దృష్టికి తీసుక పోవడం జరుగుచున్నది కనుక అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకుఅందే విధంగా చూడాలని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కొత్త రవీందర్రావు గురువారం ఒక ప్రకటనలో కోరారు.