1. తెలుగులో తొలి క్షేత్రమహాత్మ్య కావ్యం?
ఎ. భీమేశ్వర పురాణం బి.కాశీఖండం సి. నృసింహ పురాణం డి. పాండు రంగమహత్యం
2. తెలుగులో మొదటి పద్య రామాయణం?
ఎ. రంగనాథ రామాయణం బి. భాస్కర రామాయణం
సి. మొల్ల రామాయణం డి. రామాభ్యుదయం
3. భాస్కర రామాయణ కవులలో ఒకరు?
ఎ.గోన బుద్ధారెడ్డి బి.వెలిగందల నారయ
సి. కుమార రుద్రదేవుడు డి. కాచవిభుడు
4. రామాయణంలోని విభాగాలను ఏమంటారు?
ఎ. స్కంధాలు బి.పర్వాలు సి.కాండలు డి.పరిచ్ఛేదాలు
5. ఉత్తర రామాయణం రాసిన కవి?
ఎ. తిక్కన బి.గోనబుద్ధారెడ్డి సి.భాస్కరుడు డి. పింగళి సూరన
6. తెలుగులో ప్రథమాంధ్ర స్వతంత్ర దేశి పురాణం ఏది?
ఎ. విష్ణు పురాణం బి. బసవపురాణం
సి. భీమేశ్వర పురాణం డి. నృసింహపురాణం
7. క్రింది వానిలో రామాయణాన్ని రచించని వారు?
ఎ. తిక్కన బి.భాస్కరుడు సి.శ్రీనాథుడు డి. ఎర్రన
8. గరుడు పురాణాన్ని తెలుగులోకి అనుసృజన చేసిన కవి?
ఎ. మడిగి సింగన బి. వెన్నలకంటి సూరన
సి. పింగళి లక్ష్మీకాంతం డి. పింగళి సూరన
9. తెలుగు పురాణ సాహిత్యంలో కవీత్రంయం వంటివారు?
ఎ. పాల్కురికి సోమనాథుడు బి. మారన
సి. బమ్మెర పోతన డి. పైవారందరు
10. సంస్కృతంలో అష్టాదశ మహాపురాణాలు ఎవరు
రచించారు?
ఎ. వాల్మీకి మహర్షి బి. వ్యాసుడు
సి. కాళిదాసు డి. నన్నయ
11. ఈ క్రింది వానిలో
ఇతిహాసాలు?
ఎ. భాగవతం, భారతం బి. రామాయణం, భాగవతం
సి. నారదీయం, భాగవతం డి. రామాయణం, భారతం
12. నన్నయ ఆంధ్రమహాభారతంలో ఎంత వరకు
రచించాడు?
ఎ. ఆదిపర్వం, అరణ్యపర్వం, సభాపర్వంలో
తృతీయశ్వాసం వరకు
బి. ఆది, సభా, అరణ్య పర్వంలో చతుర్థాశ్వాసంలో
142వ పద్యం వరకు.
సి. ఆది, సభా, అరణ్య పర్వాలు
డి. 18 పర్వాలు రాశాడు
13. కవిత్రయంలో పద్దెనిమిది పర్వాల
మహాభారతాధ్రీకరణ ఎక్కువ భాగం రచించింది?
ఎ. నన్నయ
బి.తిక్కన
సి. ఎర్రన
డి. పాల్కురికి సోమన
14. శ్రీ మదాంధ్ర మహాభాగవతంలో ఎన్ని
స్కంధాలున్నాయి?
ఎ. 18 బి.11 సి.12 డి.7
15. ఆంధ్రమహాభారతం..?
ఎ. శాస్త్రేతిహాసం బి.కావ్యేతిహాసం సి. ఇతిహాసం డి.పురాణం
16. జతపరుచుము:
1. రామాయణం అ.పర్వం
2. భారతం ఆ. స్కంధ
3. భాగవతం ఇ. కల్పం
4. వేదాంగం ఈ. కాండం
1 2 3 4
ఎ. ఈ అ ఆ ఇ
బి. ఈ ఆ అ ఇ
సి. ఇ ఈ ఆ అ
డి. ఈ ఇ అ ఆ
సమాధానాలు
1. సి 2. బి 3. సి 4. సి
5. ఎ 6. బి 7. సి 8. డి
9. డి 10. బి 11. డి 12. బి
13. బి 14. సి 15. బి 16. ఎ
నానాపురం నర్సింహులు
9030057994