ఆ వాస్తవం ఏంటి?

మేఘశ్యాం, రేఖ నిరోష హీరో, హీరోయిన్లుగా అంజనిసూట్‌ ఫిలిమ్స్‌ సంస్థ పై ఆదిత్య ముద్గల్‌ నిర్మాతగా జీవన్‌ బండి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘వాస్తవం’. తాజాగా చిత్ర టీజర్‌ని రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత ఆదిత్య ముద్గల్‌ మాట్లాడుతూ, ‘డైరెక్టర్‌ జీవన్‌ చెప్పిన కథ, తీసిన విధానం చాలా బాగుంది. పి. ఆర్‌ అందించిన మ్యూజిక్‌కి చాలా మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమా మంచి సక్సెస్‌ అవ్వాలని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. ‘ఈ సినిమాలో చేసిన ప్రతి చిన్న క్యారెక్టర్‌ గుర్తుండిపోతుంది. నా టెక్నీషియన్స్‌, ఆర్టిస్టులు నాకు చాలా బాగా సపోర్ట్‌ చేశారు. పి.ఆర్‌ అందించిన మ్యూజిక్‌ చాలా బాగా వచ్చింది. హీరో మేఘశ్యాం, హీరోయిన్‌ రేఖ నిరోషా చాలా బాగా నటించారు’అని దర్శకుడు జీవన్‌ బండి చెప్పారు. హీరోయిన్‌ రేఖ నిరోషా మాట్లాడుతూ, ‘మా సినిమాలో చాలా మంచి కంటెంట్‌ ఉంది. అందరికీ నచ్చే కథ అవుతుంది’ అని అన్నారు. హీరో మేఘశ్యాం మాట్లాడుతూ, ‘ఎక్కడ కథ నుంచి డివియేట్‌ అవ్వకుండా చాలా బాగా కథని తీసుకుని వచ్చారు. మా సినిమా అందర్నీ అలరిస్తుందనే నమ్మకంతో ఉన్నాం’ అని తెలిపారు.