నిత్యామీనన్ లీడ్ రోల్‌లో నటించిన వెబ్ సిరీస్ ‘కుమారి శ్రీమతి’. దర్శకుడు శ్రీనివాస్ అవసరాల ఈ వెబ్ సిరీస్‌కి స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించగా, గోమటేష్ ఉపాధ్యాయే దర్శకత్వం వహించారు. 7 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్‌ను స్వప్న సినిమా సంస్థ నిర్మించింది. శుక్రవారం హీరో నాని ఈ సిరీస్ ట్రైలర్‌ను లాంచ్ చేసారు. ‘తన జీవితంలో ఒక బలమైన ఆశయం కోసం ప్రయత్నించే ధైర్య సాహసాలు కలిగిన మహిళ ప్రయాణం ఇది. తన కుటుంబం, గ్రామంలోని పడికట్టు ఆలోచనలని బ్రేక్ చేసే ఆధునిక మహిళ కథ కూడా. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈనెల 28న ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.