అయోధ్య వివాదం దేనికోసం?

What is the Ayodhya dispute for?(నిన్నటి తరువాయి …)
మూడవది, మసీదును కూల్చిన తరువాత 36 గంటల్లో కూల్చివేయబడిన మసీదు ఉన్న స్థలంలో తాత్కాలికంగా రాము ని ఆలయాన్ని నిర్మించడం ద్వారా స్థలం యొక్క యధా తధస్థితిని మార్చడాన్ని నిషేధిస్తూ ఇచ్చిన కోర్టు ఆజ్ఞల ఉల్లంఘన. రామమందిర నిర్మాణానికి స్థలాన్ని అప్ప గించిన తీర్పు, చట్టాన్ని మూడు సార్లు ఉల్లంఘించి, సుప్రీం కోర్టు ఆజ్ఞల్ని ధిక్కరించి, భారత రాజ్యాంగం లోని హామీలను, అన్ని మతాలవారి సమానత్వానికి సంబంధించిన ప్రధానమైన వాగ్దానాన్ని అగౌరవ పర చినవారికి బహుమానంగా ఇచ్చింది. గాంధీ జీవితం లోని చివరి రోజుల్లో వినరు లాల్‌ అనే చరిత్రకారుడు భారతదేశాన్ని ”భయంకరమైన ఆగ్రహం, ద్వేషం, మత మారణహౌ మంల అగ్నిగుండంగా… హిందువులు, ముస్లింలు, సిక్కులు చరమదశ పోరాటంలో చిక్కుకున్నారని” వర్ణిస్తాడు.
ఢిల్లీలోని స్వస్థలాల్లో భయంకరమైన హింసతో నిర్మూలనకు గురైన పదుల, వేల సంఖ్యలో శరణార్థులతో ఢిల్లీ నిండిపో యింది. ఢిల్లీ శరణార్థ శిబిరాలు కొనసాగుతున్న దాడులు, ఘర్ష ణలతో ఇళ్ళను వదిలిపెట్టి, లేక తరిమివేయబడిన ముస్లింలతో నిండి పోతున్నాయి. హిందూ దేవుళ్ళ విగ్రహాల్ని శరణార్థుల ఇళ్ళ ల్లో అనేక మసీదులు, దర్గాల్లో ప్రతి ష్ఠించడం ద్వారా వాటిని తాత్కా లిక ఆలయాలుగా మార్చారు. వీటిపట్ల గాంధీ ఎంతో విచారాన్ని వ్యక్తం చేశాడు.ఇతర మతానికి చెందిన ఆలయాన్ని అపవిత్రం చేయడం ద్వారా వాస్తవ ప్రార్థనా ప్రదేశాన్ని సష్టించలేమని ఆయన అన్నాడు. కాబట్టి దర్గాలు, మసీదుల్ని మన ముస్లిం సోదర సోదరీమణులకు గౌరవం గా తిరిగి ఇచ్చి వేయాలని ఆయన డిమాండ్‌ చేశాడు. అదే లెక్క ప్రకారం నేడు, హింసాత్మక అల్లరిమూక మసీదును కూల్చివేయడం ద్వారా ఆలయాన్ని నిర్మించారు కాబట్టి, అదే అయో ధ్యలోని ఆలయమే నిజమైన ప్రార్థనా స్థలం అని గాంధీ అంగీకరిస్తే నాకది ఆశ్చర్యకరమే.
జనవరి 17 వ తేదీన స్వాతంత్య్ర సమర యోధుడు మౌలానా ఆజాద్‌ తన నిరాహార దీక్ష ను విరమించాలని గాంధీ డిమాండ్‌ను భారీగా గుమిగూడిన ప్రజల ముందు ప్రకటించాడు. వాటిలో నివాస అవసరాల కోసం ఉపయోగించుకుంటున్న లేదా దేవాలయా లుగా మార్చబడుతున్న అన్ని మసీదుల్ని తరలించాలన్న విష యం ఉంది. ముస్లింల అల్లకల్లోలాలకు ముందు వారు ఆక్ర మించిన ప్రాంతాలకు స్వేచ్ఛగా వెళ్ళాలని, రైళ్ళలో ప్రయాణించే సమయంలో వారి భద్రత, ఢిల్లీలోని వారి పాత ఇళ్ళకు తిరిగి వెళ్ళే స్వేచ్ఛతో పాటు ముస్లింలను ఆర్థికంగా బహిష్కరణకు గురి చెయ్యకూడదని హామీలు ఇచ్చారు. మరుసటిరోజున ఆర్‌ఎస్‌ ఎస్‌, హిందూ మహాసభలతో పాటు వందకు పైగా సంస్థలు రాజేంద్రప్రసాద్‌ ఇంటివద్ద కలుసు కొని ఒక ఒప్పందంపై సంతకాలు చేశారు. అది ఈ విధంగా ఉంది: ”హిందువులు, ముస్లింలు, సిక్కులు ఇతర వర్గాల ప్రజలు ఢిల్లీలో సోదరభావంతో, పరిపూర్ణమైన స్నేహభావంతో కలిసిమెలిసి జీవించాలని మనసారా కోరుకుం టున్నాము. ముస్లింల ప్రాణం, ఆస్తులు,విశ్వాసాన్ని కాపాడతా మని, ఢిల్లీలో గతంలో జరిగిన సంఘటనలు మళ్ళీ పునరావతం కానివ్వమని మేము ప్రమాణం చేస్తున్నాం.”
ఇక్కడి నుండి వలస వెళ్ళిన ముస్లింలు ఇక్కడికి తిరిగి రావాలి అనుకుంటే వారు ఢిల్లీకి రావడానికి మాకెలాంటి ఆక్షేపణ లేదు. అంతకుముందు వలె వారి వ్యాపారాలు వారు నిరభ్యంతరంగా చేసుకోవచ్చని మరొక ఒప్పందంపై కూడా సంతకాలు చేశారు. ముఖ్యంగా ఇప్పుడు హిందువులు,సిక్కుల ఆధీనంలో ఉన్న మసీదుల్ని తిరిగి ఇవ్వడం జరుగుతుంది.ఇది గాంధీ హత్యకు 12 రోజుల ముందు జరిగిన విషయం.16 వ శతాబ్దంలో మహాకవి తులసీదాస్‌, వాల్మీకి సంస్కత రామా యణాన్ని సాధారణ ప్రజల భాష అయిన అవధిలో తిరిగి చెపుతాడు.అతని రామచరిత మానస అనేది ప్రపంచ సాహిత్య చరిత్రలో మహాకావ్యాలలో ఒకటిగా ఉంది.ఆయన,పవిత్రమైన సంస్కత భాషలో రాయకుండా సాధారణ ప్రజల భాషలో రాసినందుకు బ్రాహ్మణులు ఆగ్రహంతో ఊగిపోయారు.వారి దాడులకు ప్రతిస్పందనగా తులసీదాస్‌ ‘దోహ’ ను రచించాడు. అది ఈ మాటలతో మొదలైంది:
”నేను బిచ్చం ఎత్తుకొని తింటాను, మసీదులో నిద్రపో తాను.” అంటే తన కాలంలో, అన్ని మతాలకు చెందిన నిరాశ్ర యులు, దిక్కులేని వారు ఆశ్రయం పొందే స్థలాలుగా మసీదులు ఉండేవి. తులసీదాస్‌ తన జీవిత కాలంలో ఎక్కువ భాగం వార ణాసి, అయోధ్యలలోనే గడిపాడని చరిత్ర ధ్రువీకరిస్తుంది. అదేవిధంగా తులసీదాస్‌ యువకుడుగా ఉన్న సమయంలోనే అయోధ్యలో బాబ్రీ మసీదును ఏర్పాటు చేశారని కూడా అదే చరిత్ర స్థిరపరుస్తుంది. సామాన్య ప్రజలభాషలో రామకథను రాసినందుకు దాడికి గురైన మహాకవి తులసీదాస్‌ వాస్తవానికి బాబ్రీ మసీదులో నిద్రించి ఉంటాడనేది నా ఊహ. ప్రతీఒక్క భారతీయుడు వారి వారి పద్ధతుల్లో రాముని గురించి ఆలో చించే రోజులివి. నాకు ఆశ్చర్యం కలిగించే విషయమేమంటే-ఈ సుదీర్ఘమైన చరిత్రలో ఏ రాముడు విజయం సాధిస్తాడు? నాథూరామ్‌ గాడ్సే గాంధీని చంపినపుడు, గాంధీ పెదవులపై ఉన్న రాముడా? లేక రామ్‌ అని పేరున్న, గాంధీని చంపిన నాథూరామ్‌ గాడ్సే రాముడా?
(స్క్రోల్‌.ఇన్‌ సౌజన్యంతో)
అనువాదం : బోడపట్ల రవీందర్‌, 9848412451
లి ముగింపుహర్ష్‌మందర్‌