హీరోకి ఉన్న గండం ఏంటి?

What is the character of the hero?‘దేవకి నందన వాసుదేవ’తో ప్రేక్షకులను అలరించడానికి హీరో అశోక్‌ గల్లా సిద్ధంగా ఉన్నారు. అర్జున్‌ జంధ్యాల దర్శకుడు. ప్రశాంత్‌ వర్మ కథ అందించారు. నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. ఈనెల 22న ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్‌ అర్జున్‌ జంధ్యాల మాట్లాడుతూ, ”గుణ 369′ తర్వాత నేను చేసిన సినిమా ఇది. హీరో అశోక్‌ యాక్షన్‌, ఎమోషన్‌లో బాగా చేశారు. హీరోకి ఒక గండం ఉంది. ఆ గండం నుంచి ఎలా బయటపడతారనేది ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మానస పాత్రకు చాలా మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఈ సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులకు అద్భుతంగా నచ్చుతుంది. మంచి ఎమోషనల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. సాయి మాధవ్‌ అద్భుతమైన డైలాగ్స్‌ రాశారు. ఎమోషనల్‌ డెప్త్‌ పట్టుకుని కథకి తగ్గట్టుగా మాటలు అందించారు. భీమ్స్‌ ఈ సినిమాకి తన బ్యాగ్రౌండ్‌ స్కోర్‌తో ప్రాణప్రతిష్ట చేశారు. మ్యూజికల్‌గానే కాదు విజువల్‌గానూ సినిమా అద్భుతంగా ఉంటుంది. నిర్మాత బాలకష్ణ ఈ కథకి ఏం కావాలో అన్ని సమకూర్చి చాలా గ్రాండియర్‌గా నిర్మించారు. మహేష్‌ బాబుకి ట్రైలర్‌ చాలా నచ్చింది. ఆయన మమ్మల్ని అప్రిషియేట్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. సినిమాని చూస్తానన్నారు. ఈ సినిమా చూసిన వాళ్లంతా అద్భుతంగా ఉందని అప్రిషియేట్‌ చేశారు’ అని తెలిపారు.