– మాజీ మంత్రి మల్లారెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దేశంలోని అనేక రాష్ట్ర ప్రభుత్వాలను ప్రధాని మోడీ కూలగొట్టారని మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల తర్వాత ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి ఏమవుతుందో అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అంటేనే పెద్ద దరిద్రపు పార్టీ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆ పార్టీ నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలవగానే ఎగిరెగిరి పడుతున్నారని విమర్శించారు. వాళ్లకు ముందుంది మసళ్ల పండుగంటూ హెచ్చరించారు.