– రుణమాఫీ అందక ఇక్కట్లు
నవతెలంగాణ – భైంసా
రాష్ట్ర ప్రభుత్వం ఒక కుటుంబానికి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించినప్పటికీ ప్రభుత్వ నిబంధనలతో సగం మంది రైతులు రుణమాఫీకి నోచుకోవడం లేదు. రేషన్ కార్డు లేని వారికి, బ్యాంకు ఆధార్ కార్డు మిస్ మ్యాచింగ్ అయిన వారికి, పట్టా పాస్ బుక్ వారసులకు మార్చిన వారికి, మాఫీ అందక ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేశామని సంబరాలకు పిలుపునిస్తుంటే అందులో సగం మంది రైతులే సంతోషంగా ఉన్నారు. ఈరోజు రెండు లక్షల వరకు ఉన్న వారికిమాత్రమే రుణమాఫీ ఉందంటూ, వారికి అకౌంట్లో డబ్బులు జమవుతాయని అధికార వర్గాల సమాచారం ఉంది. ఒక కుటుంబంలో ఇద్దరివి ముగ్గురివి కలిపి రెండున్నర లక్షల రూపాయలకు పై పైగా రుణముంటే ఈరోజు ఖాతాల్లో డబ్బులు జమ కావని తెలుస్తుంది. అంటే ప్రభుత్వం నిబంధన విధిస్తూ రుణమాఫీని జాప్యం చేస్తూ రైతుల్లో ఆందోళన కలిగిస్తుంది. అసలే పేరు తప్పుగా ఉన్న వేలాది మంది రైతులు ఇక్కట్లు ఎదుర్కొంటుంటే, మళ్లీ రెండు లక్షల ఉన్నవారికి ఈరోజు ఖాతాలో డబ్బులు జమ చేస్తామనడం రైతులను ఆందోళన కలిగించాల్సిన అంశమే. స్పష్టమైన నిబంధనలు లేకపోవడంతో రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.