భయపడితే పర్యవసానం ఏంటి?

What is the consequence of fear?హీరోయిన్‌ వేదిక లీడ్‌ రోల్‌లో నటిస్తున్న సినిమా ‘ఫియర్‌’. ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్‌ పై ప్రొడ్యూసర్‌ ఏఆర్‌ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. దర్శకురాలు డా. హరిత గోగినేని రూపొందిస్తున్న ఈ చిత్రంలో అరవింద్‌ కష్ణ ఓ స్పెషల్‌ రోల్‌లో కనిపించనున్నారు.
ఈ సినిమా విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్‌లో 60కి పైగా అవార్డ్స్‌లను గెల్చుకుని కొత్త రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఈ సినిమా త్వరలోనే గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ సినిమాకి సంబంధించి తెలుగు టీజర్‌ను హీరో రానా, తమిళ టీజర్‌ను విజరు సేతుపతి, కన్నడ టీజర్‌ను కిచ్చా సుదీప్‌, మలయాళ టీజర్‌ను దిలీప్‌, హిందీ టీజర్‌ను ఇమ్రాన్‌ హష్మి సోషల్‌ మీడియా ద్వారా రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ఈ చిత్ర టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు.
నిర్మాత ఏఆర్‌ అభి మాట్లాడుతూ,’మా ఆవిడ హరిత చెప్పిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథ నాకు బాగా నచ్చింది. ఇంట్లో నన్ను భయపెట్టే ఆవిడ ”ఫియర్‌” సినిమాతో ప్రేక్షకుల్ని కూడా ఈజీగా భయపెడుతుందని నమ్మాను (నవ్వుతూ). మా మొదటి సినిమా ‘లక్కీ లక్ష్మణ్‌’కి ఎలా సపోర్ట్‌ చేశారో ఈ సినిమాకు కూడా అలాగే సపోర్ట్‌ చేస్తారని కోరుకుంటున్నా’ అని అన్నారు.
‘తన జీవితంలో కొన్ని అనుకోని సందర్భాల్లో ఒక అమ్మాయి భయపడితే ఆ పర్యావసనాలు ఎలా ఉంటాయి అనేది ఈ మూవీ కథ. ఈ సినిమాను మీరు థియేటర్‌లోనే ఎంజారు చేయాలి. ఈ సినిమా తప్పకుండా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది’ అని డైరెక్టర్‌ డా.హరిత గోగినేని చెప్పారు.
హీరోయిన్‌ వేదిక మాట్లాడుతూ, ‘టీజర్‌ చూశాక నా స్ట్రెస్‌ మొత్తం పోయింది. నేను ఈ సినిమాలో చేసిన రోల్‌ చాలా సంతప్తిని ఇచ్చింది’ అని తెలిపారు.