తమను తాము అత్యంత క్రూరంగా బాధించుకున్న యూ దులకు, వారు స్థాన చలనం కలిగించిన వారి నిస్సహాయతను, కోరికను అర్థం చేసుకోవడం నిజానికి అసాధ్యమా? తీవ్రమైన బాధ నిత్యం క్రూరత్వాన్ని ప్రేరేపిస్తుందా? ఇది మానవ జాతికి ఎలాంటి ఆశను కలిగిస్తుంది? విజ యం సాధించిన సందర్భంలో పాలస్తీనా ప్రజలకు ఏమి జరుగుతుంది? రాజ్యం లేని జాతి చివరకు ఒక రాజ్యాన్ని ప్రకటిస్తే, అది ఎలాంటి రాజ్యం అవుతుంది? దాని జెండా కింద ఎలాంటి భయంకర నేరాలు, ఘోరాలు జరుగుతాయి? జాతి, మతంతో నిమిత్తం లేకుండా ప్రతీ ఒక్కరికీ స్వేచ్ఛ, గౌరవం లభించే హక్కుల కోసం మనం పోరాడుతున్న ప్రత్యేక రాజ్యం ఇదేనా? మధ్య ప్రాచ్యంలో పాలస్తీనా ఒకప్పుడు మత రహిత కోట.కానీ ఇప్పుడు హమాస్ మతపరమైన భావజాలాన్ని సమర్ధిస్తూ, ఇస్లాం పేరుతో పోరాడుతోంది. ”మేము దాని సైనికులం,శత్రువులను దహించే దాని అగ్ని కణాలం” అని హమాస్ మ్యానిఫెస్టో చెపుతుంది. ఆత్మాహుతి బాంబు దా డులు చేసే వారిని ఖండించాలని ప్రపంచానికి పిలుపునిచ్చారు.కానీ వారు ఈ గమ్యానికి చేరుకోవడానికి ముందు వారు ప్రయాణించిన సుదీర్ఘమైన మార్గాన్ని మనం విస్మరించగలమా?సెప్టెంబర్ 11, 1922 నుండి సెప్టెంబర్ 11,2002 – 80 సంవత్సరాలు యుద్ధం చేయడం అనేది సుదీర్ఘ కాలం.పాలస్తీనా ప్రజలకు ప్రపంచం ఇవ్వగలిగిన సలహా ఏదైనా ఉందా? వారు గోలా మెయిర్‌ను తీసుకొని, వారిని ఉనికిలో ఉండకుండా ఉంచే నిజమైన ప్రయత్నం ఏమైనా చెయ్యాలా?
ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం నేను న్యూ మెక్సికోలో ‘రా సెప్టెంబర్ ‘ ప్రసంగం చేసినప్పుడు,పాలస్తీనా విషయంలో అమె రికాలో ఒకరకమైన నిశ్శబ్దం ఉంది. దాని గురించి మాట్లాడిన వారు భారీ మూల్యాన్ని చెల్లించారు. నేడు యువకులంతా వీధుల్లో ఉన్నారు. ముం దు నుంచి యూదులు, పాలస్తీనియన్లు నాయ కత్వం వహిస్తూ, వారి ప్రభుత్వం, అమెరికా ప్ర భుత్వం ఏమి చేస్తోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అత్యంత ఉన్నత ప్రాంగణాలతో పాటు విశ్వవిద్యాలయాలు అట్టుడికి పోతు న్నాయి. వాటిని మూసేయడానికి పెట్టుబడి దారీ విధానం వేగంగా కదులుతుంది. దాత లు నిధులను నిలిపివేస్తామని బెదిరిస్తున్నారు, తద్వారా అమెరికా విద్యా ర్థులు ఏమి చెప్పవచ్చు లేదా ఏమి చెప్పకూడదు, వారు ఎలా ఆలోచిస్తారు లేదా ఎలా ఆలోచించకూడదు అనేది నిర్ణయం అవుతుంది.ఉదారవాద విద్య అని పిలువబడే పునాది సూత్రాల ప్రధాన కేంద్రానికి ఇదొక దెబ్బ. వలసానంతర వాదం, బహుళ సాంస్కతిక వాదం, అంతర్జాతీయ చట్టం, జెనీవా సభలు, మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనల లాంటివి అన్నీ పోయాయి. వాక్ స్వేచ్ఛ లేదా ప్రజా నైతికత లాంటివి పోయాయి. అంత ర్జాతీయ చట్టం న్యాయవాదులు, పండితులు చెప్పే ”యుద్ధం” జాతి సంహా రం అన్ని చట్టపరమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉంది.దీనిలో నేర స్థులు తమను తాము బాధితులుగా చెప్పుకున్నారు.వర్ణ వివక్షత రాజ్యాన్ని నడిపే వలసవాదులు అణచివేతకు గురైన వారుగా చెప్పుకున్నారు.
9/11 తరువాత పౌర హక్కులను విచ్చిన్నం చేయడానికి, విస్తత మైన దురాక్రమణ నిఘా వ్యవస్థను నిర్మూలించడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పాలనా వ్యవస్థలకు అమెరికా యుద్ధం రక్షణను ఇచ్చింది.దానిలో మన ప్రభుత్వాలకు మన గురించి ప్రతీది తెలుసు కానీ మనకు వారి గు రించి ఏమీ తెలియదు.అదేవిధంగా, అమెరికా నూతన మొకార్థీయిజం గొడుగు కింద ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఘోరమైన విషయాలు పెరిగి, అభివద్ధి చెందుతాయి. మన దేశంలో కొన్ని సంవత్సరాల క్రితమే ప్రారం భమైందనుకోండి. కానీ మనం మాట్లాడకుంటే, అది ఊపందుకుంటుంది, మనను తుడిచి పెడుతుంది.భారతదేశంలోని అగ్రశ్రేణి యూనివర్సిటీలలో ఒకటైన ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థుల ప్రవర్తనా నియమావళిని జారీ చేసింది.నిరాహార దీక్ష లేదా ధర్నాకు దిగిన ఏ విద్యార్థి అయినా రూ.20 వేలు జరిమానా చెల్లించాలి.దేశ వ్యతిరేక నినాదాలు చేస్తే రూ.10 వేలు జరిమానా విధించారు.ఆ నినాదాలు ఏమి టి అనేవి ఇంకా ఆ జాబితాలో లేవు. కానీ ముస్లింల జాతి నిర్మూలన, ముస్లింల జాతి ప్రక్షాళన కోసం ఇచ్చే పిలుపులు దానిలో ఉండవని మా త్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. కాబట్టి పాలస్తీనాలో యుద్ధం కూడా మనదే. మనం చెప్పవలసింది ఖచ్చితంగా చెప్పాలి,పదే పదే స్పష్టంగా చెప్పాలి.
ఇజ్రాయిల్, వెస్ట్ బ్యాంక్‌ను ఆక్రమించడం, గాజాను ముట్టడించడం మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలు. ఆక్రమణకు పెట్టుబడి పెట్టి, మద్దతిచ్చిన అమెరికా, ఇతర దేశాలు కూడా ఆ నేరంలో భాగస్వాములే. ప్రస్తుతం మనం చూస్తున్న ఘోరం, హమాస్‌తో పాటు ఇజ్రాయిల్ పౌరు లను అనాలోచితంగా చంపడం అనేది ఆక్రమణ,ముట్టడిల పర్యవసా నంగానే జరిగింది. క్రూరత్వం గురించి చేసే ఎన్ని వ్యాఖ్యానాలైనా,రెండు పక్షాల మితిమీరిన చర్యల ఖండనలైనా గానీ,పరిష్కారానికి దారి తీయవు. ఆక్రమణే రాక్షసత్వాన్ని పెంచుతుంది.ఇది నేరస్తులకు,బాధితులకు ఇరు వురికీ హాని కలిగిస్తుంది.బాధితులు చనిపోతారు. నేరస్తులు, వారు చేసిన పనితో జీవించాల్సి ఉంటుంది. వారి పిల్లలు కూడా తరతరాలుగా అలాగే ఉంటారు.
పరిష్కారం మిలిటరీ సంబంధమైనది కాదు.ఇజ్రాయిలీలు, పాలస్తీని యన్లు ఇద్దరూ కలిసి గౌరవంగా,సమాన హక్కులతో జీవించే రాజకీయం గా మాత్రమే ఇది ఉంటుంది.ప్రపంచం జోక్యం చేసుకోవాలి.ఆక్రమణ అంతం కావాలి.పాలస్తీనియన్లు మాతభూమిని కలిగి ఉండాలి.పాలస్తీనా శరణార్థులకు తిరిగి వచ్చే హక్కు ఉండాలి. లేకపోతే, పాశ్చాత్య ఉదారవాద నైతిక నిర్మాణం ఉనికిలో లేకుండా పోతుంది.ఇది ఎప్పుడూ కపటంగానే ఉన్నదనే విషయం మనకు తెలుసు. కానీ ఇది కూడా ఒక విధమైన ఆశ్ర యాన్ని సమకూర్చింది.ఆ ఆశ్రయం మన కళ్ళముందే కనుమరుగవు తుంది. కాబట్టి దయచేసి పాలస్తీనా, ఇజ్రాయిల్ కొరకు, జీవించి ఉన్నవారి కొరకు,చనిపోయిన వారి పేరున, ఇజ్రాయిల్ జైల్లో ఉన్న పాలస్తీనియన్లు, హమాస్ చేతిలో బందీలుగా ఉన్న వారి కోసం, మొత్తం మానవాళి కోసం ఈ వధను ఆపండి.
(”ఫ్రంట్ లైన్” సౌజన్యంతో)
అనువాదం : బోడపట్ల రవీందర్, 9848412451
అరుంధతీ రారు