నాడు లేని ప్రేమ నేడెందుకో?

– సంధ్యారెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పాలమాకుల పాఠశాల విద్యార్థులకు భోజనం సరిగ్గా పెట్టలేదంటూ విద్యార్థులను విద్యాశాఖ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కౌగిలించు కున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి సంధ్యారెడ్డి తెలిపారు. అయితే గతంలో బాసర ఐఐఐటీ విద్యార్థులకు భోజనం సరిగ్గా పెట్టటం లేదని ధర్నా చేస్తే సబితా ఇంద్రారెడ్డి ప్రేమ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.