కాండ్రకోట మిస్టరీ ఏంటి?

కాండ్రకోట మిస్టరీ ఏంటి?వరుణ్‌ సందేశ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘నింద’. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రాజేష్‌ జగన్నాథం నిర్మించడమే కాకుండా కథ, కథనాన్ని రాసి దర్శకత్వం వహిస్తున్నారు. ది ఫర్వెంట్‌ ఇండీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై నిర్మించిన ఈ మూవీ టైటిల్‌ లోగో, పోస్టర్‌ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో ఈ చిత్రం రాబోతోంది. తాజాగా వరుణ్‌ సందేశ్‌ పాత్రకు సంబం ధించిన పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. భిన్నంగా ఉన్న ఈ పోస్టర్‌తోనే అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించారు. ఈ సినిమా షూటింగ్‌ కంప్లీట్‌ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈనెల 15న టీజర్‌ను కూడా మేకర్స్‌ విడుదల చేయబోతున్నారు. ఆనీ, తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్‌, చత్రపతి శేఖర్‌, మైమ్‌ మధు, సిద్దార్థ్‌ గొల్లపూడి, అరుణ్‌ దలై, శ్రేయా రాణి రెడ్డి, క్యూ మధు, శ్రీరామ్‌ సిద్దార్థ్‌ కష్ణ, రాజ్‌ కుమార్‌ కుర్రా, దుర్గా అభిషేక్‌ తదితరులు ఈ చిత్రంలోని ప్రధాన తారాగణం.