– ఇంత జరుగుతున్నా.. ఉన్నతాధికారుల ఉదాసీనత ఏమిటి?
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఇంటి గుట్టు లంక కు చేటు తెచ్చినట్లు స్టేషన్ అంతర్గత వ్యవహారాలే ఎస్.ఐ శ్రీను ప్రాణం మీదకు తెచ్చా యా? ఇంత జరిగినా ఉన్నతాధికారులు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించారు? ఎందరికో ఇలాంటి విషయాలు పై ధైర్యం చెప్పాల్సిన ఎస్.ఐ ఇలాంటి ప్రాణాపాయ స్థితికి ఎందుకు తెచ్చుకున్నాడు? పోలీస్ స్టేషన్ లో ఒక అధికారి కే న్యాయం జరగకపోతే సామాన్యులు పరిస్థితి ఏమిటి? గతం లో ఓ ఎస్.ఐ కంటతడి పెట్టుకుంటూనే వెళ్ళాడని ప్రచారం జరుగుతుంది.అంటే స్టేషన్ లో కొందరి హవా నే ఎస్.ఐ లు ఇలా కావడానికి కారణమా? బలహీన వర్గాల కు చెందిన ఎస్.ఐ ల సమయంలోనే ఇటువంటి వివాదాలు తలెత్తడం పరిపాటిగా మారడం ఏమిటి? గత రెండు రోజు లు నియోజక వర్గం వ్యాప్తం గా ప్రతీ ఒక్కరి నోటా ఇవే ప్రశ్నలు వినపడుతున్నాయి. ఎన్నికల బదిలీల్లో భాగంగా ఎస్.ఐ శ్రీను ఫిబ్రవరి 14 న బోడ్ నుండి అశ్వారావుపేట బదిలీ పై వచ్చారు. సౌమ్యుడు గా పేరొందిన శ్రీను వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం, నారక్కపేట కు చెందిన దళిత సామాజికవర్గం కు చెందిన వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2013 చివరి బ్యాచ్ లో నెగిటివ్ మార్క్స్ బ్యాచ్ లో ఎస్.ఐ గా నెగ్గాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం పోలీస్ స్టేషన్ లో ట్రైనింగ్ పూర్తి చేసుకొని అన్నపురెడ్డిపల్లి, కొత్తగూడెం త్రీ టౌన్, బోడ్, చుంచుపల్లి, డిసిఆర్బి కొత్తగూడెం, మణుగూరు పోలీస్ స్టేషన్ లో నిజాయితీగా విధులు నిర్వహించారు. ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా అవినీతి ఆరోపణలు, ఎటువంటి ఫిర్యాదులు లేకుండా నిజాయితీగా విధులు నిర్వహించి ఆయా ప్రాంత ప్రజల మన్ననలు చూరగొన్న ఎస్సై శ్రీనివాస్ ఇంతటి బలహీనమైన పనికి ఒడి గట్టడం విచారకరం.

అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ కి బదిలీ అయిన ఐదు నెలల కాలంలో నాలుగు మెమోలు ఎందుకు జారీ అయ్యాయి? ఓ పై అధికారి మరో నలుగురు సిబ్బంది అత్యుత్సాహం,వేధింపులే కారణమా అని చర్చించుకుంటున్నారు పట్టణం అంతా! ఒక ఎస్ ఐ పై ఆయనకు వ్యతిరేకంగా జిల్లా ఉన్నతాధికారికి ఓ కానిస్టేబుల్ పిర్యాదు చేయడం,ఆ ఉన్నతాధికారి ఎస్ఐ ను మందలించడంతో ఆవేదనకు గురి అయినట్లు చెప్పుకుంటున్నారు.ఈ క్రమంలో సిబ్బందిలో కొందరు ఎస్ ఐ కు అనుకూలంగా మరికొందరి సిబ్బంది పై డివిజన్ అధికారికి పిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతుంది.ఇందులోను ఆ అధికారి ఎస్.ఐ నే మందలించి నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఎస్.ఐ పై కొందరు వ్యక్తిగత చెడు ప్రచారం చేయడం ప్రారంభించినట్లు తెలుస్తుంది.స్టేషన్ కు సంబందించిన పనులు అప్పగించి నప్పుడు నిరాకరించడం చోటు చేసుకునేది అని చెప్పుకుంటున్నారు.ఏ పీసీ నైనా గట్టిగా మందలి స్తే తిరిగి ఈయన పైనే నెపం వేయడం తో పాటు జిల్లా ఉన్నతాధికారులకు పిర్యాదు చేయడం పరిపాటిగా మారింది అట. ఈ క్రమంలోనే తీవ్రమైన మనస్థాపానికి గురైన ఎస్ఐ శ్రీను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇంత జరిగినా సోమవారం సాయంత్రం వరకు పోలీస్ ఉన్నతాధికారులు ఎవరూ ఈ సంఘటన పై పత్రికా ముఖంగా స్పందించకపోవడం మరింత విస్మయానికి గురిచేస్తుంది.