కథ వెనుక జరిగిన కథ ఏంటి?

దండమూడి బాక్సాఫీస్‌ బ్యానర్‌పై రూపొందుతున్న తొలి చిత్రం ‘కథ వెనుక కథ’. విశ్వంత్‌ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్‌, శుభ శ్రీ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. కష్ణ చైతన్య దర్శకత్వంలో అవనింద్ర కుమార్‌ నిర్మిస్తున్నారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో రూపొందిన ఈ సినిమాను ఈనెల 24న రిలీజ్‌ చేస్తున్నారు. ‘డైరెక్టర్‌ కావాలనుకునే ఓ యువకుడు (విశ్వనాథ్‌) ఓ కథను సిద్ధం చేసుకుంటాడు. సిటీలో అమ్మాయిలు కనిపించకపోవటంపై ఓ కథను రెడీ చేసుకుంటాడు. అయితే నిజంగానే సిటీలో అమ్మాయిలు కనిపించకుండా పోవటమే కాదు.. హత్యకు కూడా గురవుతుంటారు. ఈ కేసుని ఇన్వెస్టిగేట్‌ చేయటానికి ఓ పోలీస్‌ ఆఫీసర్‌ (సునీల్‌) వస్తాడు. తను అనుమానాస్పదంగా ఉంటూ డైరెక్టర్‌ కావాలనుకునే యువకుడిని అరెస్ట్‌ చేస్తాడు. అసలు అమ్మాయిలు సిటీలో కనిపించకుండా పోవటానికి కారణం ఎవరు?, ఆ క్రైమ్‌ వెనుకున్న గ్యాంగ్‌ ఏది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. నిర్మాత దందమూడి అవనీంద్ర కుమార్‌ ఈ చిత్రాన్ని అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. సినిమాలోని పాటలను ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా రిలీజ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుగుతోంది’ అని చిత్ర బృందం తెలిపింది. అలీ, సునీల్‌, జయ ప్రకాష్‌, బెనర్జీ, రఘు బాబు, సత్యం రాజేష్‌, మధు నందన్‌, భూపాల్‌, ఛత్రపతి శేఖర్‌, ఖయ్యుం, ఈరోజుల్లో సాయి, రూప తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.