వట్టి మాటలు కట్టి పెట్టి ఏఏ ఆభివృద్ది జీవోలు తెచ్చావు.?

– జుక్కల్ మాజీ ఎమ్మెలే హన్మంత్ షిండే
నవతెలంగాణ – జుక్కల్
వట్టి మాటలు కట్టి పెట్టి ఏఏ ఆభివృద్ది జీవోలు తెచ్చావో ప్రజలకు వివరించాలని జుక్కల్ మాజీ ఎమ్మెలే హన్మంత్ షిండే అన్నారు. మంగళ వారం నాడు మండల కేంద్రంలోని ఎంపీపీ యశోదా నీలు పటేల్  కార్యాలయంలో బీఆర్ఎస్ మద్దతుదారులైన సర్పంచులతో సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. జుక్కల్ మండలం బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి అత్యదిక మెజార్టీ ఇచ్చిన వారందరికి కృతఙ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెలే ఆవాకులు చేవాకులు పేలడం మానేయాలని కేసీఆర్, నన్ను తిట్టడం తప్పా ఓరగ పెట్టింది ఎమి లేదని అన్నారు. బీఆర్ఎస్ హయంలో ఆభివృద్ది జర్గి పల్లేలు వికసించాయని ,పల్లెల రూపు రేఖలు మారాయని అన్నారు. 5వందల పైచులుకు కోట్లలతో ఆభివృద్ది కార్యక్రమాలు చెపట్టానని, నీవు వచ్చి మూడు నెలలు గడుస్తున్న ఏ ఒక్క జీవో నైన తేే గలిగావా అని ప్రశ్నించారు. గతం కాంగ్రేస్ యాబైఎండ్ల పాలనలో వంద గ్రామాలకు రోడు సౌకర్యం ఉంటే , పదిహెను ఎండ్లు నా హయంలో వంద గ్రామాలకు రోడ్లు వేయించానని అది మీకు కన్పించడం లేదా అని విమర్శించారు. జుక్కల్ నియేాజక వర్గంలోని ఐదు మండలాలలో సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంబించానని, ఆ పనులు ఎప్పుడు చేస్తారని ఎద్దేవా చేసారు. ఈజీఎస్   నిధులు నాహయంలో 5కోట్లు మంజూరైతే వాటినే వివిధ గ్రామాలకు ఐదేసి  లక్షలు ఇచ్చి అవి  తమ నిధులేనని చెప్పుకుంటు  తిరుగుతున్నారని,  రైతుబంధు రోజుకో, పూటకో  మాట చెప్పుతున్నారని విమర్శించారు.  సమస్యలు పరిష్కరించక పోతే వంద రోజుల తరువాత ప్రజల సహకారంతో కాంగ్రేస్ ఇచ్చిన ఆరు హమీల అమలు చేయాలని లేకుంటే ప్రజల మద్దతుతో పోరాటాలు చేసి సాదిస్తామని, ప్రజలకు మా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని పేర్కోన్నారు. సర్పంచు పెండింగ్ బిల్లులు రెండు కోట్లు:- సర్పంచులు చేపట్టిన పనులకు సంభందించినవి సమారుగా రెండు కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయని , కలెక్టర్ మాట్లాడి సమస్య పరిష్కరింప చేస్తానని మండల సర్పంచులకు తెలియ చేసారు. వెంటనే పరిష్కారం జర్గుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెలే హన్మంత్ షిండే,  వైస్  ఎంపిపి ఉమాకాంత్ దేశాయి, బీఆర్ఎఎస్ నాయకులు నీలుపటేల్, మాదారావ్ దేశాయి, బొల్లి గంగాధర్, వెంకట్ రావ్ పటేల్,  రాజశేఖర్ పటేల్, ఙ్ఞానేశ్వర్, హన్మండ్లు, రాజు,  మాజీ సర్పంచులు బెంపెలి రాములు, రవిపటేల్, సంజీవ్, గొల్ల హన్మండ్లు , దినేష్, గణేష్ పటేల్, తదితరులు పాల్గోన్నారు.