మంత్రులను కలిసిన నిరాశే మిగిలింది..

– యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు
నవతెలంగాణ-డిచ్ పల్లి
గత మూడు రోజుల నుండి హైదరాబాదులోనే ఉంటూ మంత్రులు ఉన్నత విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దయాకర్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తోపాటు తదితర మంత్రులను తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ల బాధలను వివరించడం జరిగిందని, దినిలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్పందిస్తూ డిమాండ్ కోసం మీ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారని, ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు  బోయిన్పల్లి వినోద్ కుమార్ మా విషయంలో చొరవ తీసుకొని త్రిబుల్ ఐటీ బాసర్ వైస్ ఛాన్సలర్ వెంకటరమణ తో మాట్లాడి కమిటీ రూపంలో రెగ్యులరైజ్, న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపిన నిరాశే మిగిలిందని తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంఘం అధ్యక్షులు వి దత్తాహరి పేర్కొన్నారు.మంగళవారం యూనివర్సిటీ లో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు తాము చేసే రోజువారి దిన చర్యలు బాగంగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ముందు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్స్ ఒక్కటే నని రెగ్యులరైజ్ దీన్ని సాధించడానికి సమిష్టిగా కృషి చేస్తామని వారన్నారు ఒకటే లక్ష్యం ఒకటే గమ్యం అదే రెగ్యులరైజేషన్ దీనికోసం మేమందరం సమిష్టిగా పోరాటం చేసి రెగ్యులరైజేషన్ సాధిస్తామని తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు  బలమైన బలగంతో సమావేశం నిర్వహించామని ఇప్పటికైన ప్రభుత్వం, ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీ నేరవేర్చాలని అయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమానికి జాక్  కో కన్వీనర్ గంగ కిషన్, నాగేశ్వరరావు ,నారాయణ గుప్తా, సురేష్ ,నాగేంద్రబాబు ,మోహన్, జలంధర్ ,దేవరాజ్ శ్రీనివాస్ ,సిహెచ్ శ్రీనివాస్, బి ఆర్ నేత, డాక్టర్ శరత్, గోపిరాజ్, రామ్, సౌమ్య, రమ్య, జోష్న, అపర్ణ, స్వామి రావు, రాజేశ్వర్ ,నర్సింలు, సందీప్, గంగ కిషన్, డానియల్,  కిరణ్ రాథోడ్ తో పాటు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ల బృందం పాల్గొన్నారు.