రేవంత్‌ చెప్పేదొకటి… చేసేదొకటి

–  అవన్నీ వృధా నియామకాలు : బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత రావుల శ్రీధర్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ సలహాదారులు ఎందుకు అంటూ నేటి సీఎం రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారనీ, కాని తాను ముఖ్యమంత్రి అయ్యాక నలుగురు సలహాదారులను ఆయన నియమించుకున్నారని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత రావుల శ్రీధర్‌ రెడ్డి విమర్శించారు. రేవంత్‌ చెప్పేదొకటి…చేసేదొకటంటూ ఆయన విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో రావుల విలేకరుల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే సలహాదారుల వ్యవస్థ అసలే ఉండదంటూ గతంలో చెప్పిన రేవంత్‌ ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.