
కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు అందుకున్న రైతులు రైతు భీమా కోసం ఆగస్టు_5 లోపు దరఖాస్తు చేసుకోవాలని బొమ్మలరామారం మండల వ్యవసాయ అధికారి పద్మ సూచించారు. సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. జూన్ 28 వరకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం వచ్చిన 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసున్న రైతులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని తెలిపారు. దరఖాస్తులతో పాటు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, నామిని ఆధార్ కార్డు జిరాక్స్ జత చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.వ్యవసాయ అధికారులు రైతు వేదికలో, రైతులకు అందుబాటులో ఉంటారని అన్నారు.గతంలో రైతు బీమా లో నమోదు చేసుకొన్న రైతులు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, రైతు బీమా లో నామిని, ఇతర సవరణలకు ఆగస్టు 30 వరకు ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ రాజశేఖర్, రైతులు పాల్గొన్నారు.