అమృతం వైదికులకే. ఆధిపత్య అధికార వర్గాలకే. శ్రామి కులకు, బలహీనులకు విషామతమే గతి. భారత స్వాతంత్య్రం 75వ ఏట ప్రవేశించిన 2021 స్వాతంత్య్ర ఉత్సవాన ప్రధాని అమృతకాల పదం వాడారు. విజయ సాధనకు కొత్త పనుల ప్రారంభానికి నిర్దోష వేళను సూచించే వైదిక జ్యోతిష్య పదమిది. 2022 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి, 2022 స్వాతంత్య్ర దినోత్సవాన ప్రధాని ఈ పదాన్ని పలుమార్లు పలికారు. శ్రేష్ట భారత విజయానికి పౌరులు బాధ్యతలు తెలుసుకోవాలని మోడీ నొక్కిచెప్పారు. ముస్లింలు హక్కులు అడగ రాదన్నది సంఫ్‌ు తాత్వికత. పౌరులే హక్కులు అడగ రాదన్నది మోడీయం. 2022 ఆగస్టు 2047 ఆగస్టు మధ్యకాలం అమృతకాలమని మోడీ వాదన. స్వాతం త్య్ర అమృత మహోత్సవమనీ అన్నారు. సమాజ లక్ష్యాల పూర్తికి అమృతకాలం సువర్ణావకాశమని, అభివృద్ధి దేశం, వలసవాద విముక్తి, వారసత్వ గర్వం, సమైక్యత సమగ్రతలు, బాధ్యతా ప్రాధాన్యత అన్న పంచ పౌరసంకల్పాలను బోధిం చారు. ఆదినాగు తాడుగా దేవదానవులు పాలసముద్రాన్ని చిలి కారు. అసురులు (సారా తాగనివారు) నాగు తల వైపు విషాన్ని భరించారు. సురులు (సారా తాగేవారు) తోక పట్టుకు ఊగారు. చంద్రుడు, పారిజాతం, కల్పవృక్షం, కామధేనువు, దేవసారా దేవ త, అప్సరసలు, ఐరావతం, లక్ష్మి, ఉచ్ఛైశ్వం, పాంచజన్యం, గద, ధనుషు, రత్నాలు, ధన్వంతరి, అమృతం సముద్రం నుండి వెలు వడ్డాయి. అన్నిటినీ దేవతలు మోసంతో కొట్టేశారు. అమృతం తాగి అమరులయ్యారు. శ్రమదోపిడీ, నిరసన, అణచివేతే రాహుకేతువుల హత్యలు.
మోడీ ప్రభుత్వనూతన విద్యావిధానంలో పలు ప్రజావ్యతి రేకతలతో పాటు విద్యావ్యవస్థను ధార్మిక సంస్థలకు అప్పగిం చడం ప్రధాన అంశం. సరస్వతీ మందిర్లు, దీనానాథ్ బాత్రా అధీనంలోని సంఫ్‌ు విద్యాభారతి, ప్రజ్ఞాభారతి, ‘మోడీ భారతి’ బీజేపీ ధార్మిక సంస్థలు. హిందీ రాజ భాష అవుతుంది. వినోదం పేరుతో వైదికమత ప్రచారం పెరుగుతుంది. హిందూయేత రులపై ద్వేషం పెంచే సినిమాలను నిర్మిస్తారు. హిందూ యేతరులపై దాడులు, హింస, హత్యలు పెరుగుతాయి. అదాని, అంబానీలే వివిధ రంగాల వాణిజ్యంలో ఉంటారు. జలశక్తి మంత్రిత్వ శాఖ గంగోత్సవం జరిపింది. నదీహారతి, బట్టలు, వస్తువులు నదిలో పారేయడం ఇందులో భాగాలు. కర్నాటక బీజే పీ ప్రభుత్వం విద్యాలయాల్లో రోజూ పది నిమిషాల ధ్యానం తప్ప నిసరి చేసింది. గుజరాత్ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి అమ లు ప్రక్రియ మొదలుపెట్టింది. ఇది దేశమంతా వ్యాపి స్తుంది. అందులో ఆధిక్య మత భావాలను, సాంప్రదా యాలను మాత్రమే పొందుపరుస్తారు. శాకాహారమే తినాలి. శాఖ, కులమతాంతర వివాహాలు నిషేధించబ డతాయి. మనుస్మృతి రాజ్యాంగం, కాషాయజెండా జా తీయ పతాకం, గోవు జాతీయ జంతువు, కమలం జా తీయ పుష్పమవుతాయి. మోడీ జాతిపిత అవుతారు.
75 శాతం పోలీసులు, న్యాయవాదులు కొందరు న్యాయమూర్తులు సంఫ్‌ు భావజాల బానిసలు. సంఫ్‌ు భావజాల సైన్యాధికారులు అందలాలెక్కారు. అలా ఎక్కించడానికి నియమాలను ధిక్కరించారు. మార్చారు. అగ్నిపథ్ ఈ పరిస్థితిని తారుమారు చేస్తుంది. సైన్యం లోకి సంఫ్‌ు భావజాల వ్యక్తులు ఎన్నికవుతారు. వారిలో దిగ్గ జాలను కొనసాగిస్తారు. ఇతరులను బజారున పడేస్తారు. వివశులను చేసి ధర్మ, రామ, హనుమాన్ వంటి హిందు సేనలలో, భజ రంగదళ్ వంటి సమాంతర సంఫ్‌ు సైనిక సంస్థలలో సభ్యు లుగా, శిక్షకులుగా చేర్చుతారు. సమాజ కాషాయీకరణ జరు గుతుంది. మిగిలిన వారు సామాజిక వ్యర్థులుగా రిజర్వ్ వైదిక సైన్యంగా మారతారు. హిందువులకు మాత్రమే పౌరసత్వం ఉం టుంది. వలసవచ్చిన హిందువులకూ పౌరసత్వమిస్తారు. వీరికే ఓటు హక్కు, జీవించే హక్కు ఉంటాయి. పుట్టుకతో భారతీ యులయినా ఇతర మతస్తులు, ప్రత్యేకించి ముస్లింలు పౌర సత్వం కోల్పోతారు. వారికి ఓటు, జీవించే హక్కులు ఉండవు. వారు శరణార్థి శిబిరాలలో, జైళ్ళలో కుక్కబడతారు. వైదికమతమే ఉంటుంది. ఇతర మతాలన్నీ మాయమౌతాయి. హిందు గుళ్ళను మాత్రమే పునర్నిర్మిస్తారు. కడతారు. ఇదే ప్రగతి సూచీగా ప్రచా రం చేస్తారు. హిందుత్వ పూజా సామగ్రి, వస్తుసేవలను వైదికులే అమ్మాలి. ఇతర మతస్తులు అమ్మరాదు. ఇతర మత వస్తుసేవ లను వైదికులు అమ్మవచ్చు. హిందు ఆలయాల వద్ద ఇతర మతస్తులు భిక్షమెత్త రాదు. గోమాతలను వైదిక మతవాదులు రోడ్లపై వదిలేయవచ్చు. గోరక్షణాలయాల్లో గడ్డిపెట్టకుండా చంపవచ్చు. ముస్లింలు గోవులను రక్షించినా వారిని చంపుతారు. ముస్లింల ఫ్రిజ్‌లో గోంగూర పచ్చడి కూడా గోమాంసమే. గేటెడ్ కమ్యూనిటీలలో, అపార్టుమెంట్లలో, ఆస్పత్రుల్లో హిందు ఆల యాలనే కడతారు.
గతపాలనలో ప్రభుత్వ పనే దైవకార్యం అనేవారు. బీజేపీ సుపరిపాలనలో దైవకార్యమే, ఆధిపత్య మత కార్యాలే రాజధ ర్మాలు, ప్రగతి కార్యాలు. కుంభమేళాలు, నదీ హారతులే ప్రజాసే వలు. ఇతర మతాచారాలు దేశద్రోహాలు. హిందు ఆలయాల నిర్మాణ, ప్రారంభ కార్యక్రమాలల్లోనే ప్రధాని ప్రధాన పూజారిగా పాల్గొంటారు. చర్చీలు, మసీదులు పట్టవు. వైదికాన్ని పెంపొం దించే బీజేపీ మాత్రమే ‘ఒక దేశం ఒక పార్టీ’ సూత్రం కింద ఉంటుంది. ఇతర పార్టీల ఉనికి ఉండదు. సంఘీయులు, మోదీ యులు మాత్రమే నీతిపర రాజకీయ కిరీటాలు ధరిస్తారు. భాజ పేయ జంధ్యం ధరించినవారు పునీతులవుతారు. ఇతరులను అవినీతిపరులుగా, అక్రమ సంపాదనాపరులుగా సిబిఐ, ఇడి, ఎన్.ఐ.ఎ. నిరూపిస్తాయి. ఈ ప్రహసనానికి అవినీతి నిర్మూలన, జాతి సంపద రక్షణ వంటి బిరుదులు ఇస్తారు. ప్రతిపక్షపాలిత రాష్ట్రాలలో, ఒకవేళ ఉంటే, గవర్నర్లు సమాంతర పాలకులవు తారు. చట్టసభల్లో, పదవుల్లో హిందువులే ఉంటారు. అసత్యవా దులు, పగటి వేషగాళ్లు, పాములాటగాళ్లు పాలకులుగా స్థిరప డతారు. గాంధీ హంతకులతో సహా హంతకులు, అత్యాచారులు, సంఫ్‌ు నాయకులే దేశభక్తులు. ప్రాయోజితాలకు అర్హులు. కూర గాయల అంగళ్లు, చిల్లర కొట్లలో కూడా మోడీ బొమ్మలు పెట్టాలి. లేకుంటే కేంద్ర మంత్రులు దండెత్తుతారు. నిధులను ఆపేస్తారు. పాలనలో, చట్ట నిర్మాణంలో రాజ్యాంగ లొసుగులను వాడుకుం టారు. లౌకిక, సామ్యవాదం వంటి పదాల స్థానంలో వైదిక మతం వంటి పదాలకు చోటు కల్పిస్తారు.
చట్టసభల్లో పాలకుల ప్రవచనాలే చట్టాలు. చర్చలు, భిన్నా భిప్రాయాలు, స్త్రీశిశు బలహీనవర్గాల శ్రేయస్సుకు తావుండదు. అమృతకాలం హిందువులకే. బహిరంగ ప్రదేశాల్లో మత నిర్మా ణాలను కాపాడాలని 2009లో సుప్రీంకోర్టు ఆదేశించింది. ”ఆ మేరకు” 2021లో కర్నాటక ప్రభుత్వం చట్టం చేసింది. ఇతర మ తాల ప్రార్థనా స్వేచ్ఛను తొలగించింది. మత మార్పిడి చట్టంలో హిందువులు ఇతర మతాలకు మారరాదు. ఇతరులు హిందువు లుగా మారితే అది స్వగృహ ప్రవేశం. స్వయం నిర్ణయ వయోపరి మితితో మోదీ వైదొలగవలసివస్తే అమిత్ ప్రధాని, యోగి గృహ మంత్రి అయ్యే అపాయం ఉంది. ద్వితీయ శ్రేణి వైదిక కేజ్రీలు ప్రత్యామ్నాయాలుగా మారతారు. పొరబాటున ఇతర కూటము లు గెలిచినా అవి వైదిక ధర్మ పాలననే, విధానాలనే, చట్టాలనే కొనసాగిస్తాయి. ప్రత్యామ్నాయ పక్షాలు సారూప్య గమ్యాన్ని మరి చి గమన భేదాల్లో, ఐక్యతను అశ్రద్ధ చేసి స్వీయ ఘనతల ప్రచా రంలో మునుగుతాయి. అసంతృప్తులను అణగదొక్కుతూ బలహీ నపడుతూ ఉంటాయి.
అన్నిరంగాల సంస్థల అధిపతులు, అధికారులు సంఫ్‌ు భా వజాలురే. రూపాంతర ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌లు స్వమత శకు నులుగా, శల్యులుగా మారతారు. నేటి భారతం అప్రకటిత హిం దుదేశం. సమాచార సాంకేతికతలు విస్తరించని నాటి ముసోలిని ఫాసిజం, హిట్లర్ నాజీయిజంతో పోల్చితే నేటి భారత నియంత త్రయం నూతన క్యాపిటలిస్టు, కార్పొరేటిస్టు నాజీ-ఫాసిజం చాలా అపాయకరమయింది. ఇది అమృతకాలంలో లభించబో యే విషామృతం. గరళకంఠులుగా మారాలా? విషశరీరులను విసర్జించాలా? రాహుకేతు పోరాటాలు సాగాలా? ఇవి నేటి సవాళ్లు.
సంగిరెడ్డి హనుమంత రెడ్డి
949020 4545