‘చైనా, రష్యాలో వానొస్తే… కమ్యూనిస్టులు భారతదేశంలో గొడుగు పడతారు’ ఇది కమ్యూనిస్టు వ్యతిరేకుల గోల. గత కొన్నేళ్లుగా ఇలాంటి మాటలు వినం. కానీ, చైనా, రష్యాలో ప్లూ, వైరస్ సోకితే మాత్రం ఇక్కడ వస్తుం దంటూ కొత్తప్రచారం మొదలుపెట్టారు. కమ్యూ నిస్టులపై ఉన్న తీవ్రమైన ద్వేషాన్ని ఈ విధంగా తీర్చుకుంటున్నారు. ఇందులో వాట్సాప్ యూనివర్సిటీ పెద్ద రిసెర్చ్ చేస్తున్నది. చైనా, వియత్నాం, క్యూబా, రష్యా వంటి దేశాల్లో జరు గుతున్న అభివృద్ధి ఆ యూనివర్సిటీకి కనిపించదు. అక్కడి జీవన ప్రమాణాలు వినిపించవు. విద్యా, వైద్యం వంటి రంగాల్లో చేపట్టిన సంస్కరణలు అస్సలు బోధపడవు.రహదారులు, పారిశ్రామిక అభివృద్ధి ఎలా ఉందో దృష్టియే పెట్టదు. మత విభజన, విద్వేషం, దౌర్జన్యం, దాడులకు పూనుకోవడం మీదనే ఎక్కువగా పరిశోధన చేస్తున్నట్టు కనిపిస్తున్నది. అందుకే వారూ, వీరు మాట్లాడుకుంటున్న మాటలను, లేనిపోని వార్తలను జమచేస్తూ… వాట్సాప్ మాధ్యమం ద్వారా ప్రజల నెత్తిన పోస్తున్నది. ‘అక్కడ కక్కితే ఇక్కడ దోసిళ్లు పడుతున్నట్టు’ తాజాగా ‘చైనాలో ఏదో వైరస్ వచ్చింది. ఇక్కడ జాగ్రత్త ఉండాలి’ అంటూ మరోసారి కమ్యూనిస్టులపై ద్వేషాన్ని వెల్లగక్కుతున్నది. ఆస్పత్రు లేమో అక్కడ వైరస్ వస్తే ఇక్కడ మందులిస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. అక్కడ రోగమొస్తే…ఇక్కడ ఇంజక్షన్లు అమ్ముకుంటు న్నాయి. ప్రజల భయాన్ని పెట్టుబడిగా మార్చుకుని లాభాలు సంపాదిస్తున్నాయి.. కరోనా వచ్చినప్పుడు రోజుకో న్యూస్, పూటకో వ్యూస్‌తో కోట్లమందిని భయాందోళనలకు గురిచేసింది వాట్సాప్ యూని వర్సిటీ. ఇప్పుడు మళ్లీ ఎక్స్‌ఫైరీ అయిన పాత ఫార్ము లాను బయటకు తీస్తున్నది. అది వికటించి పెను ప్రమా దాన్ని సృష్టించవచ్చు. అది చేసే పుకార్లు నమ్మొద్దు.
– గుడిగ రఘు