మేడారంలో వీల్ చైర్ వితరణ

 

నవతెలంగాణ- తాడ్వాయి

మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల ఆలయం లో అనారోగ్యాలు గాయాలు వైకల్యాలు వయస్సు సంబంధిత ఆరోగ్య పరిస్థితిల కారణంగా నడవలేక, కష్టంగా లేదా అసాధ్యంగా ఉన్న వికలాంగుల భక్తుల కోసం మేడారం ఎండోమెంట్ జూనియర్ అసిస్టెంట్ బాలకృష్ణ బంధువులు వీల్ చైర్ ను బహుకరించారు. గద్దెల వరకు భక్తులను వీల్ చైర్ ద్వారా తీసుకొచ్చి ప్రత్యేక దర్శనం చేస్తారు. ఈ కార్యక్రమంలో జగదీశ్వర్, రఘువీర్, బాలకృష్ణ, బంగారి ధనుంజయ, ఎండోమెంట్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.