నవతెలంగాణ-రాయపోల్ : అకస్మాత్తుగా ద్విచక్ర వాహనం బ్రేక్ వేయడంతో వాహనం అదుపుతప్పి వాహనంపై కింద పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన తిమ్మక్ పల్లి గ్రామ శివారులో గురువారం చోటుచేసుకుంది. రాయపోల్ పోలీసుల కథను ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన పంగ మహేష్ (32) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ప్రతిరోజులాగే గురువారం వ్యవసాయ పనుల నిమిత్తం వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో తిమ్మక్ పల్లి గ్రామ శివారులో ద్విచక్ర వాహనం అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వాహనం అదుపుతప్పి ద్విచక్ర వాహనంపై కిందపడ్డాడు. తలకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించగా చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స నిర్వహించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు మహేష్ మృతి చెందినట్లు ధృవీకరించారు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రాయపోల్ ఎస్సై రఘుపతి తెలిపారు.