సరికొత్త కథలతో సినిమాలను నిర్మించాలనే లక్ష్యంతో 20్‌ష్ట్ర సెంచరీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే నూతన నిర్మాణ సంస్థ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ బ్యానర్‌లో తెరకెక్కుతున్న తొలి చిత్రానికి ‘లగ్గం టైమ్’ అని టైటిల్ పెట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ‘భీమ్లా నాయక్’ దర్శకుడు సాగర్ కె చంద్ర ఆవిష్కరించారు. సినిమాపై ఫస్ట్‌లుక్ చాలా క్యూరియాసిటీని రైజ్ చేస్తోందని, ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలని ఆయన అభిలషించారు. రాజేష్ మేరు, నవ్య చిత్యాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో నెల్లూరు సుదర్శన్, ప్రీతి సుందర్, ప్రణీత్ రెడ్డి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రజోత్ కె వెన్నం కథ అందించడమే కాకుండా డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్ర మ్యూజిక్ రైట్స్‌ను ఆదిత్య మీడియా కొనుగోలు చేసింది. పెళ్ళి నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రేక్షకుల హదయాలను హత్తుకునే ఓ మంచి కథతో రానుందని, ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎంజారు చేసేలా సినిమా తీస్తున్నామని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కథా రచయిత, దర్శకుడు: ప్రజోత్ కె వెన్నం, నిర్మాత: కె. హిమ బిందు, సంగీతం- సినిమాటోగ్రఫీ : పవన్ గుంటుకు.