
నవతెలంగాణ – అశ్వారావుపేట
గృహలక్ష్మి పేరుతో అడా హుడి చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికే నిర్మించిన డబుల్ బెడ్ రూం లను లబ్ధిదారులకు ఎందుకు పంపిణీ చేయడం లేదని తెదేపా అశ్వారావుపేట నియోజక వర్గం ఇంచార్జీ కట్రం స్వామి ప్రశ్నించారు. మండలంలోని తిరుమలకుంట లో గ్రామ కమిటీ అధ్యక్షులు పర్సా రమేష్ ఆధ్వర్యంలో తెలుగు దేశం పార్టీ ముఖ్య నేతల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలను, పార్టీ బలోపేతంపై చర్చించారు చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని వేగం చేయాలని తెలిపారు.డబల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించి తెలంగాణ ప్రభుత్వం పేదవాడి కలలు సహకారం చేసేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమం డబుల్ బెడ్ రూమ్. అయితే ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం ఎలా ఉన్నా, నిర్వాహణలో లోపంతో పేదలకు పంచాల్సిన ఇండ్లు నిరుపయోగంగా మారుతున్నాయి అన్నారు.ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కలిసి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కాస్త అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి అన్నారు.అధికారులు వచ్చి చూసుకొని పోతున్నారు లాటరీ తీస్తున్నారు ప్రజలను మబ్య పెడుతున్నారు అని,అర్హులైన వారికి వెంటనే ఇల్లు మంజూరు చెయ్యాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు నార్లపాటి శ్రీనివాసరావు, అంకోలు వెంకటేశ్వరరావు, పర్సా రమేష్, ఉప్పల బ్రహ్మo, చిందిరాల నాగేంద్ర రావు, డాబా రామదాసు, మడకం అంజి తదితర టిడిపి నాయకులు పాల్గొన్నారు.