కళా సృష్టి ఇంటర్నేష నల్, మణిదీప్ ఎంటర్టై న్మెంట్ బ్యానర్లపై జి. శంకర్, ఎల్. మధు నిర్మించిన చిత్రం ‘ఉద్వేగం’. ఈ కోర్టు డ్రామాకు మహిపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. త్రిగుణ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో దీప్సిక కథానాయికగా నటించగా, శ్రీకాంత్ భరత్, సురేష్ నాయుడు, పరుచూరి గోపాలకృష్ణ, శివకృష్ణ, అంజలి తదితరులు కీలకపాత్రలు పోషించారు. భిన్న ప్రమోషన్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈనెల 22న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని సాంకేతిక కారణాల వల్ల ఈనెల 29న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా నిర్మాతలు శంకర్, మధు మాట్లాడుతూ, ‘ఈనెల 29న తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో విడుదల చేయబోతున్నాం. అలాగే కర్ణాటకతో పాటు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లోనూ భారీగా విడుదల చేయనున్నాం. సినిమాని వీలైనంత ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం’ అని తెలిపారు.