నవతెలంగాణ – సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఉపాధ్యాయుడిగా కనిపించాడు సిరిసిల్లలోని గీతా నగర్ ప్రభుత్వ పాఠశాలలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ కనిపించాడు. పాఠశాలలో 8,9,10 తరగతుల విద్యార్థులకు ఇంగ్లీషు , గణితం, బౌతిక శాస్త్రాలను బోధించారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి వారిచ్చిన సమాధానాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు గణితం, ఆంగ్లం సబ్జెక్ట్ ల పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రధానోపాధ్యాయురాలిని ఆదేశించారు. ఇప్పటినుండి 10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపి పరీక్షలలో మంచి ఫలితాలు సాధించేలా చర్యలు చేపట్టాలని 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇప్పటినుండి పదవ తరగతి సిలబస్ పై అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.