కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇండ్లు

నవతెలంగాణ- చండూరు: తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే  ఇల్లు లేని ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని  కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ధోని పాముల జోగిగూడెం తుమ్మలపల్లి తిమ్మారెడ్డి గూడెం, బంగారిగడ్డ  తదితర    గ్రామాలలో తిరిగి  ముమ్మురంగా ప్రచారం నిర్వహించారు. ఆయనకు ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. గ్రామ గ్రామాన మహిళలు, పూల వర్షం కురిపిస్తూ మంగళహారతులతో స్వాగతం పలికారు. మూడున్నర సంవత్సర కాలంలో ఏ ఒక్క నిధులు కూడా కేటాయించలేదన్నారు. నా రాజీనామా తోనే మునుగోడు నియోజకవర్గానికి  కెసిఆర్ 570 కోట్ల నిధులు  మంజూరు చేయించారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. ప్రతి పేదవాళ్ళకి న్యాయం జరుగుతుందన్నారు. ఇంకా నియోజకవర్గం  మరింత అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. . కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన వారు గ్యారెంటీ కార్డు పథకాలను ప్రజలకు వివరించారు. తెలంగాణను ఇచ్చింది తల్లి సోనియమ్మ అని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి సోనియా మకు గిఫ్ట్ ఇవ్వాలని కోరారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కట్టిన ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఇప్పటివరకు చెక్కుచెదరలేదని, కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టులు నిర్మించిన పిల్లర్లు కుంగిపోవడం ప్రభుత్వ అసమర్ధ పాలనకు నిదర్శనన్నారు.  అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి  నబ్బమ్ తూకి  పాల్గొని ప్రచారం నిర్వహించారు. ఈ  కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోడి గిరిబాబు, వెంకట్ రెడ్డి, సప్పిడి రాములు, ఎంపిటిసి పల్లె వెంకన్న, సీపీఐ(ఎం) నేతలు  నల్ప రాజు  రామలింగయ్య, సతీష్, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.