నవతెలంగాణ- చివ్వేంల: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతామని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని తిమ్మాపురం, మోదిన్ పురం, పాండ్య నాయక్ తండ, మున్యా నాయక్ తండ, చివ్వేంల, వట్టి ఖమ్మం పహాడ్ గ్రామాలతో పాటు పలు గ్రామాలలో, తండాలలో సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్ రెడ్డి గెలుపు కోసం ప్రచారం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుడి వలే పనిచేసి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చెయ్యాలన్నారు. సూర్యాపేటలో జగదీష్ రెడ్డిని, రాష్ట్రంలో కేసీఆర్ ను ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు. అనంతరం వివిధ పార్టీల కు చెందిన గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ లు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోచేరారు. పలు కార్యక్రమాలలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు వీరన్న నాయక్, ఎంపీటీసీ వేములపల్లి వాసుదేవరావు, చింతమల్ల రమేష్, దారోజు జానకి రాములు, నంద్యాల సోమిరెడ్డి, నంద్యాల నరేష్ రెడ్డి, కొణతం అప్పిరెడ్డి, కొడెడల వెంకన్న, కొడేదల హరీష్, సగరపు దుర్గయ్య, వెన్న మధుకర్ రెడ్డి, పఠాన్ సమీర్, రాములు నాయక్, సాగర్, ఛత్రు నాయక్, వేముల చిన్న, జంపాల అంజయ్య, ఎల్క నర్సిరెడ్డి, ఖమ్మంపాటి రాము, సుమన్, రఫీ, జానిమియా, నరేష్, మధు, శివ తదితరులు పాల్గొన్నారు.