
– నామమాత్రపు తనిఖిలు.. చర్యలు నీళ్ళు..
నవతెలంగాణ – మాక్లూర్
రైతులు పెట్టుబడి కోసం ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి అప్పులపాలు కాకుండా రుణాలు అందించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే సహకార సంఘం ముఖ్య ఉద్దేశం.. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఏటా కోట్లాది రూపాయల లావాదేవీలు జరుపుతుంటాయి. లక్షల రూపాయల ఎరువుల వ్యాపారం చేస్తుంటాయి. ధాన్యం కొనుగోళ్లు చేసి రైతులకు సొమ్ము జమ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కలన్నిoటిని సంబంధిత సిబ్బంది ఆడిట్ చేయాల్సి ఉంటుంది. మాక్లూర్ సహకర సంఘం జిల్లా లోనే అతి పెద్ద సొసైటీ. సుమారు 26 గ్రామాల రైతులు సభ్యులుగా గల సొసైటీలో 5 వేల మంది సభ్యతం గలదు. గత కొన్ని రోజులుగా సిబ్బంది, డైరెక్టర్లు అవినీతికి పాల్పడుతున్నారు. రైతుల అమాయకత్వన్ని ఆసరాగా చేసుకొని, అధికారులు, ప్రజా ప్రతినిధులు నిధుల దుర్వినియోగానికి పాల్పడుతూ జిల్లాలోనే అవినీతిలో నంబర్ వన్ గా మార్చారు. సొసైటీ లో అవినీతి కొంభకోణాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. అనుమతులు లేకుండా ఇస్టారీతిన గోదముల నిర్మాణాలు, అనామత్ ఖాతాల పేరిట కోట్లలో కుంభకోణాలు వెలుగు చూశాయి. కొత్తగా ఎరువుల అమ్మకాల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. మాక్లూర్ సోసైటీ పరిధిలో గుత్ప, డికంపల్లి, మాక్లూర్, కల్లేడీ, గొట్టుముక్కల, చిక్లి కేంద్రాలలో ఎరువుల విక్రయాలు జరుపుతుంటారు. గుత్పలొ 28.34 లక్షలు, మాక్లూర్ 16.17 లక్షలు, కల్లేడీ లో 11.50 లక్షలు, డికంపల్లి లో 4.16 లక్షలు, గొట్టుముక్కులలొ 3.06 లక్షలు, చిక్లి లో 7.27 లక్షలు దుర్వినియోగానికి పాల్పడ్డారు. సంబంధిత అధికారులు అడిట్ లో తేల్చారు. అరు కేంద్రాలలో 70 లక్షలకు పైగా అవినీతి కుంభకోణం జరిగింది. ఈ ఎరువుల డబ్బును నిర్ణిత గడువులో చెల్లిస్తామని పాలక వర్గానికి చెప్పిన ఇంత వరకు చెల్లించక పోవడం గమనర్హం. ఇంత అవినీతి జరిగిన అధికారులు చూసి చుడనట్లుగా వ్యవహరిస్తున్నారనీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవినీతిలో కురుకుపోయిన సొసైటీ ని గాడిలో పెట్టాలని రైతులు కోరుతున్నారు. వరి ధాన్యం కొనుగోలు సమయంలో లక్షల్లో లాభాలు వచ్చిన అవి ఎక్కడికి పోతున్నాయి తెలియదు. రైతులకు తూతూ మంత్రంగా సర్వసభ్య సమావేశంలో చదివి వినిపిస్తారు తప్ప వచ్చిన లాభాల్లో రైతులకు ఇవ్వరు. సిబ్బంది, పలక వర్గం మధ్యనే ఉంటుంది. ఇలాంటి వారిపై ఉన్నత అధికారులు స్పందించి విండో సిబ్బంది, అధికారులను ప్రక్షాళన చేయాల్సిందిగా రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.