
నవతెలంగాణ – రాయపర్తి
మండలకేంద్రంలోని లహరి పబ్లిక్ స్కూల్లో మంగళవారం టీచర్స్ డేను పురస్కరించుకుని స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయుల వేషధారణలో విచ్చేసి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రవిచంద్ర మాట్లాడుతూ.. విద్యార్థులకు భవిష్యత్తులో ఈ రోజు ఒక మధుర స్వప్నాగా నిలిచిపోతుంది అని తెలిపారు. ప్రతి దినం పాఠాలను వినే విద్యార్థులు ఒక రోజు బోధించడం వల్ల తరువాత దినం నుంచి తరగతి గదిలో క్రమశిక్షణతో నడుచుకుంటారు అని వివరించారు. స్వయం పరిపాలన దినోత్సవంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనడం సంతోషకారం అన్నారు. చిన్నారుల వేషధారణ ఆకట్టుకున్నాయి తెలుపుతూ.. విద్యారులను మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవి, రాజు, సబితా, భాగ్యలక్ష్మి, స్వర్ణలత, జ్యోతి, స్వాతి, స్రవంతి, రవళి, విద్యార్థులు వరుణ్, అఖిత, విగ్నేష్, మాచర్ల చేతన్, అర్చన, అవంతిక, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.