
విద్యార్థులు ఉపాధ్యాయులుగా విధులు నిర్వ హించడం హర్షణీయం మని ప్రధానోపాధ్యాయులు పి.రామ చంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని పెద్ద మసాన్ పల్లి మధిర గ్రామం వడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు ఉపాద్యాయులుగా విధులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందులో ఎంఈఓ గా బి.నీరజ, పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా కృష్ణ ప్రసాద్, ఉపాధ్యా యులుగా దీపక్, శైలజ విధులు నిర్వహించారు. విద్యార్థులు సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొ న్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్ర మంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్, రాజు, సిఆర్పి బాలకృష్ణ తదితరులు ఉన్నారు.