విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ.!

– జోరుగా.. హుషారుగా ఒకరోజు బాధ్యతలు
– అలరించిన చిన్నారులు
నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలంకేంద్రం లోని బట్టుగూడెం ప్రాథమిక పాఠశాలలోగురువారం స్వపరి పాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెల్మగూడెం స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు హిమావంత్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా పాఠాలను బోధించారు. మరి కొందరు విద్యార్థులు విధి నిర్వహణలో తమవంతు బాధ్యతలు నిర్వహించారు. హెచ్ఎం గా శివ, ఎంఈఓ గా జ్యోతి, డీఈఓగా పవిత్ర, డిప్యూటీ డీఈవోగా యామిని, కలెక్టర్ గా రోహిత, విద్యాశాఖ మంత్రిగా అక్షిత వారి యొక్క పాత్రలను సక్రమంగా నిర్వర్తించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలలకు అందించే సంక్షేమ పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు  అనురాధ మరియు ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు  పాల్గొన్నారు.