
నవతెలంగాణ-పరకాల టౌన్ : పరకాల పట్టణంలో గురువారం రోజున శారద విద్యాలయంలో ప్రిన్సిపాల్ మార్క సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా బాలల దినోత్సవం నిర్వహించారు. భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినం పురస్కరించుకొని పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులై తమ ప్రతిభాపాటవాలతో తరగతులు నిర్వహించారు. విద్యార్థులు సంస్కృతిక కార్యక్రమంలో పాల్గొని మన సంస్కృతి, సంప్రదాయాలను ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే ప్రదర్శనలతో అలరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మార్క సత్యనారాయణ గారు విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులు నైతిక విలువలు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అభ్యసించాలని విద్య ఒక్కటెే మనల్ని సమాజంలో ఉన్నత స్థాయిలో నిలబెట్టగలదని పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.