విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ..

When the students are the teachers..నవతెలంగాణ – రాయపర్తి
మండలంలోని కొండూరు గ్రామంలో బుధవారం జడ్పీఎస్ఎస్ పాఠశాలలో విద్యార్థులు ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భం పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా బి వర్షిత్ రెడ్డి, ఆర్జెడిగా సంజన, డీఈఓగా సాయి వర్ధన్  వ్యవహరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు పద్మలత మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు. రోజు విద్యాబుద్ధులు నేర్చుకునే విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విధానం నాకట్టుకుందని అభినందించారు. స్వయం పరిపాలన దినోత్సవంతో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది అన్నారు. తదుపరి ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సత్యం, రామిరెడ్డి, వివి ఆచార్య, సత్యనారాయణ, కటకం రఘు, వెంకటరమణ, శ్యామ్ సుందర్, శ్రీదేవి, అనిత, రాణి,  నాగరాజు, బొజ్జ్య, స్వర్ణ,  స్వామి, శివకృష్ణ  తదితరులు పాల్గొన్నారు.