డ్రై ఫ్రూట్స్‌ ఎప్పుడు తినాలి?

When to eat dry fruits?చాలా మంది ఉదయాన్నే డ్రై ఫ్రూట్స్‌ తినడానికి ఇష్టపడతారు. సాయంత్రం పూట తినే వారు కూడా ఉన్నారు. డ్రై ఫ్రూట్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జీడిపప్పు, బాదం, మఖానా, ఎండుద్రాక్ష, ఖర్జూరం, వాల్‌నట్స్‌ వంటి డ్రై ఫ్రూట్స్‌ తినే సమయంపై పోషకాహార నిపుణులు ఏమంటున్నారో చూద్దాం. డ్రై ఫ్రూట్స్‌లో ప్రోటీన్‌, ఫైబర్‌, ఒమేగా 3, ఫ్యాటీ యాసిడ్స్‌తో సహా అనేక పోషకాలు ఉంటాయి. అవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. డ్రై ఫ్రూట్స్‌ తినడం వల్ల అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బాదం, వాల్‌నట్‌లను రాత్రంతా నానబెట్టి తినాలి.
డ్రై ఫ్రూట్స్‌ను నానబెట్టి తింటే చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, డ్రై ఫ్రూట్స్‌ ఉదయం ఖాళీ కడుపుతో తినాలి. అప్పుడు శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. రోజంతా తగినంత శక్తిని పొందుతారు. ఉదయం అల్పాహారానికి ముందు లేదా తర్వాత తీసుకోవచ్చు.
మధ్యాహ్న భోజనం తర్వాత డ్రై ఫ్రూట్స్‌ను స్నాక్స్‌గా కూడా తినవచ్చు. కానీ రాత్రిపూట వీటిని తినకుండా ఉంటేనే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. వీటిలో ఉండే అధిక ప్రొటీన్‌ జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. రాత్రిపూట డ్రై ఫ్రూట్స్‌ తినడం వల్ల జీర్ణక్రియ సరిగా పనిచేయదు.