– కక్కిరేణి గ్రామ సర్పంచ్ పిట్ట కష్ణారెడ్డి
– రైతులు వరి కోతలకు సిద్ధమవుతున్నారు అధికారులు సిద్ధంగా ఉండాలి
– ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి
నవతెలంగాణ- రామన్నపేట
మండల కేంద్రం నుండి కక్కిరేణి గ్రామం రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, ప్రతిసారి చెప్పొద్దని, వినడానికి బాధగా ఉందని, అద్వాన స్థితికి చేరిన ఈ రోడ్డును ఎప్పుడు నిర్మిస్తారో చెప్పాలని కక్కిరేణి గ్రామ సర్పంచ్ పిట్ట కష్ణారెడ్డి మండల సర్వసభ్య సమావేశంలో అధికారులను అసహనంతో ప్రశ్నించారు. శనివారం మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ కన్నబోయిన జ్యోతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బి ఏ ఈ రాజశేఖర్ మాట్లాడుతూ మండలంలో పాలు రోడ్లు మంజూరయ్యాయని, కక్కిరేణి గ్రామం రోడ్డు కూడా మంజూరు అయిందనగానే సర్పంచ్ పిట్ట కష్ణారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. 11సార్లు టెండర్ పిలిచామని ఏ ఒక కాంట్రాక్టర్ ముందుకు రావడంలేదని ఏఈ సందర్భంగా సభ దష్టికి తెచ్చారు. బిల్లులు రావడంలేదని ఉద్దేశంతోనే కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదని ఈ సందర్భంగా పలువురు సభ్యులు సభలో ప్రస్తావించారు. మిషన్ భగీరథ మంచినీళ్లు రావడంలేదని లక్ష్మాపురం సర్పంచ్ ఉప్పు ప్రకాష్, ఏఎంసీ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్, ఎంపీటీసీ గొరిగే నరసింహ సభ దష్టికి తీసుకొచ్చారు. ఎంపీపీ జ్యోతి, జడ్పిటిసి పున్న లక్ష్మి జగన్మోహన్ మాట్లాడుతూ వరి కోతలు పక్షం, నెల రోజుల్లో మొదలవుతాయని అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో తహసిల్దార్ లాల్ బహదూర్, ఎంపీడీవో జలంధర్ రెడ్డి, పి ఎస్ సి ఎస్ చైర్మన్ నంద్యాల బిక్షం రెడ్డి, ఎంపీటీసీలు వేమవరం సుధీర్ బాబు, గాదె పారిజాత, గోగు పద్మ, సర్పంచులు గుత్త నరసింహారెడ్డి, కడమంచి సంధ్య, రేఖ యాదయ్య, బందుల యాదయ్య, పి ఆర్ ఏ ఈ గాలయ్య, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ప్రశాంత్ రెడ్డి, ట్రాన్స్కో ఏ ఈ నరసింహ, డాక్టర్ వీరన్న, డాక్టర్ శాంతి బాబు, ఏపీవో వెంకన్న తదితరులు పాల్గొన్నారు.