– రాకపోకలకు ఇబ్బందులు
– పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోని పాలకులు
– గుంతలు పడిన రోడ్డుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు, పాదాచారులు
– ప్రమాదాలు జరగకముందే బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించాలి : గ్రామస్తులు
నవతెలంగాణ -కొందుర్గు
రంగారెడ్డి జిల్లాలోని కొందుర్గు మండల పరిధిలోని ఉత్తరస్పల్లి, టేకులపల్లి గ్రామాల మధ్యలో ఉన్న బీటీ రోడ్డు బ్రిడ్జి పూర్తి స్థాయిలో ధ్వంసమైంది. దీంతో ఇరు గ్రామాల ప్రజలకు రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది. రాత్రి సమయంలో రోడ్డు ప్రయాణికులకు మరింత ప్రాణ సంకటంగా మారింది. ఈ రోడ్డు మార్గం బాగానే ఉన్నదనుకుని రాత్రి వెళ్లలో కొత్తవారు వస్తే కచ్చితంగా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రమాదకరమైన ఘటనలు జరగక ముందే అధి కారులు, పాలకులు స్పందించి బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని స్థానికులు చెబుతున్నారు. గత ఎమ్మెల్లే ఎలక్షన్స్ కీ ముందు నుంచి ఈ రోడ్డుపైనే బ్రిడ్జి కూలిపోయిందనీ, ప్రమాదాలు జరగక ముందే నిర్మాణ పనులు ప్రారంభించాలని గ్రామస్తులు అంటున్నారు. వర్షా కాలం వచ్చేట ప్పటికి రాకపోకలకు ఇబ్బంది కలగకుండా బ్రిడ్జి పనులు పూర్తయితే ఇరుగ్రామాల ప్రజలకు వాహన దారులకు ప్రయాణం సౌకర్య వంతంగా ఉంటుం దని పలువురు అభిప్రాయం వెల్లడించారు. ఉత్తర స్పల్లి ప్రజలకు కొందుర్గు మండలానికి రాకపోకలకు బాగానే ఉంటుంది. ఎటోచ్చి టేకులపల్లి గ్రామస్తులకు వర్షాకాలం వస్తే కొందుర్గు మండల కేంద్రానికి రాకపోకలు స్తంభిస్తాయని ఆందోళన చెందుతున్నారు. ఈ ఎండాకాలంలోనే బ్రిడ్జి పనులు పూర్తయితే వర్షా కాలంలో ఇబ్బందులు ఉండవనీ సంబంధిత అధి కారులు త్వరతగతిన పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. చాలా సమయాల్లో ఎమ్మెల్లే వీర్లపల్లి శంకర్ టేకులపల్లి బ్రిడ్జి, వెంకీర్యాల బ్రిడ్జి, లాలపేట బ్రిడ్జి పనులు త్వరగా చేయాలనీ గత ప్రభుత్వం హయాంలో ధర్నాలు చేశారు. రైతులకు, ప్రజలకు రవాణా సౌకర్యార్థం ఇబ్బందులు కలగొద్దని ప్రభుత్వం పైన పోరాటం చేశారు. గత ప్రభుత్వం హయాంలో వెంకీర్యాల బ్రిడ్జి పనులు మొదలెనప్పటికీ పనులు నత్త నడకన నడుస్తున్నాయి ఆ బ్రిడ్జి ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియని పరిస్థితి, లాలపేట, టేకుల పల్లి బ్రిడ్జి పనులు ఇప్పటికీ మొదలు పెట్టలేదు. ప్రస్తుతం నూతన ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం కొలువు తీరింది. ఇప్పటికైనా షాద్‌నగర్ నియోజక వర్గం ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని టేకులపల్లి, లాలపేట బ్రిడ్జి నిర్మాణం పనుల విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుని సమస్య పరిష్కరించాలని ప్రజలు కోతున్నారు.