
నవతెలంగాణ-దుబ్బాక రూరల్
రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ దే విజయమని దుబ్బాక గడ్డపై తిరిగి బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని దుబ్బాక పీఏసిఎస్ చైర్మన్ షేర్ల కైలాస్, దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ పాపని సురేష్ గౌడ్ లు అన్నారు. సోమవారం అక్బర్ పేట భూంపల్లి మండలం పరిధిలోని చిన్న నిజాంపేట్ గ్రామంలో టిఆర్ఎస్వి, బీఆర్ఎస్ యూత్, టిఆర్ఎస్ సోషల్ మీడియా కమిటీలు, ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బి ఆర్ ఎస్వీ గ్రామ అధ్యక్షులుగా చింతాకుల స్వామి, సోషల్ మీడియా అద్యక్షుడు గా షేర్ల విజయ్,సోషల్ మీడియా అధ్యక్షుడు గా సంఘం రమేష్ లు ఏకగ్రీవమైనట్లు వారు మీడియాతో వెల్లడించారు. ఎలక్షన్లో ఓట్ల కోసం మాత్రమే బీజేపీ , కాంగ్రెస్ నాయకులు ఇండ్లల్లోకి వస్తారని అన్నారు.రాబోయే రోజుల్లో దుబ్బాకలో గులాబీ జెండా ఎగిరే విధంగా కంకణబద్దులై కార్యకర్తలంతా పని చెయ్యాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టిఆర్ఎస్వి దుబ్బాక మండల అధ్యక్షులు పరశురాం,గ్రామ కమిటీ అధ్యక్షులు మెరుపుల స్వామి గౌడ్ , చౌదర్పల్లి మహంకాళి, కనికీ పరశురాములు, శనగపల్లి దుర్గయ్య, కోనాపురం, పరశురాములు తదితరులు పాల్గొన్నారు.