కిరోసిన్ దీపం కింద చదువుకొని.. కిరాయి ఇంట్లో ఉన్న జగదీష్ రెడ్డికి వేలకోట్లు ఎక్కడివి..?

– అసెంబ్లీలో మాజీ విద్యుత్ శాఖ మంత్రి పై విరుసుకు పడ్డ  మునుగోడు ఎమ్మెల్యే ..

– పదేళ్లుగా చేసిన పాపాలను ఎండగట్టి అవినీతిని బయటికి తీస్తాం..
– బొగ్గు గనుల వద్ద ఏర్పాటు చేయాల్సిన పవర్ ప్లాంట్లను దూరం ప్రాంతాలలో ఏర్పాటు చేయడంతో ప్రజాధనం దుర్వినియోగం అయింది..
నవతెలంగాణ- మునుగోడు
కిరోసిన్ దీపం కింద చదువుకొని , కిరాయి ఇంట్లో ఉన్న మాజీ విద్యుత్ శాఖ మంత్రి  జగదీశ్వర్ రెడ్డి కి వేలకోట్ల సంపాదన ఎట్లా వచ్చింది అధ్యక్ష అంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు . గురువారం అసెంబ్లీలో  విద్యుత్ సమావేశం వాడి వే”డి”గా సాగింది . ఇసుక మాఫియా, భూమాఫియా తో వేల కోట్లు సంపాదించి నాగారంలో, తుంగతుర్తిలో బంగ్లాలు కట్టిన కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి అధ్యక్ష అంటూ అసెంబ్లీలో జగదీశ్వర్ రెడ్డి కి సవాల్ విసిరారు. బొగ్గు గనులు, బావులు  ఉన్నచోట పెట్టవలసిన పవర్ ప్లాంట్లను 250 కిలోమీటర్ల దూరంలో పెట్టడంతో రవాణా సౌకర్యాలు భారం కావడంతో పాటు ప్రశాంతంగా ఉన్న ప్రాంతాలలో కలుషితం చేశారని మండిపడ్డారు . ఈ తప్పుడు నిర్ణయం ను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ఉంటే ఈ నష్టం జరిగేది కాదని అన్నారు. ప్రాజెక్టుల , పవర్ ప్లాంట్ , ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ , రాష్ట్ర అభివృద్ధి కోసం , ప్రజల సంక్షేమం కోసం అప్పు చేస్తే తప్పులేదు కానీ అనవసరంగా కాలేశ్వరం ప్రాజెక్టు వద్దని చెప్పిన వినకుండా వాళ్ల కమిషన్ల కోసం ప్రాజెక్టులు కట్టి మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని అప్పులు చేసి అప్పుల కుప్పగా తయారు చేశారని మండిపడ్డారు . పర్మినెంట్ గా ఇక్కడనే అధికారంలో ఉంటామని కల కన్నా బిఆర్ఎస్ నాయకులకు ప్రజలు ఇచ్చిన షార్ట్ ట్రీట్మెంట్ తో మతిభ్రమించి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు అధ్యక్ష అని అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ మారారు అని మాట్లాడుతున్న బిఆర్ఎస్ నాయకులకు కెసిఆర్  కాంగ్రెస్ లో రాజకీయ ప్రస్తావన మొదలుపెట్టి టిడిపికి , టిఆర్ఎస్  ఎట్లా వచ్చాడో మూడు పార్టీలు మారిన మాజీ సీఎం కేసీఆర్ చరిత్ర ను గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్న సభ్యులకు సమస్యల మీద మాట్లాడేందుకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం కల్పించాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా వాళ్ల గొంతు నొక్కేయొద్దని అవకాశం కల్పిస్తే  దయ్యాలు వేదాలు వల్లించినట్లు పది సంవత్సరాలు పాపాలు చేసి అక్రమంగా అడ్డదారుల్లో  బిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు సంపాదించుకున్న అవినీతి సొమ్మును కక్కిస్తామని అన్నారు. మిగులు బడ్జెట్తో ఏర్పడిన రాష్ట్రంలో కనీసం జీతాలు ఇవ్వలేని పరిస్థితికి తీసుకువచ్చినది ఎవరు అధ్యక్ష అని ప్రశ్నించారు..? కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదల రాజ్యం రాజ్యంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చి ఆర్థిక సంక్షేమంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం ను గాడిలో పెట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.