ఈ ఏడాది మన దేశ బడ్జెట్ అక్షరాల రూ.42 లక్షల కోట్లు. ఇందులో కేంద్రం క్రీడా రంగానికి ఏ మేరకు నిధులు కేటాయించిందనేది ప్రభుత్వమే పరిశీలన చేసుకోవాలి.పదహారేండ్ల వయసులోనే అమెరికా క్రీడాకారుడు క్వీన్సివిల్సన్ రన్నింగ్‌లో బంగారు పతకం సాధించడం మన దేశానికి ఒక సవాల్. యువకులు, చైతన్యవంతులు, సామర్థ్యంగలవారు, క్రీడల్లో రాణించగలిగే సత్తా ఉన్నవారు భారత్‌లో కూడా ఎక్కువే. కానీ వారిని గుర్తించి, ప్రతిభాపాటవాలను వెలికి తీయకపోవడం వల్లే పారిస్ పతకాల వేటలో మనం ఓడిపోయాం.
ప్రపంచక్రీడ వేదికపై భారత కీర్తి పతాకం ఎగురుతుందని ఆశించాం. ఒలంపిక్స్ క్రీడ సమరంలో బంగారు పతకం లేకుండనే భారత క్రీడాకారులు వెనుదిరిగారు. రెండంకెల పతకాలు సాధించి విశ్వవేదిక శిఖర స్థాయిలో క్రీడాకారులు నిలుస్తారని భావించాం. టోక్యోలో జరిగిన ఒలంపిక్స్ క్రీడలో భారత్ 71 స్థానంలో నిలువగా జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు పారిస్‌లో జరిగిన క్రీడలో భారత్ 71వ స్థానంలో నిలిచిందంటే క్రీడారంగం పట్ల మన పాలకుల నిర్లక్ష్యవైఖరిని తెలియజేస్తోంది. ప్రతిభ కనబరుస్తున క్రీడాకారులకు ప్రోత్సహించలేకనా, రాజకీయ క్రీనీడ అవరించడం వల్లనా భారత క్రీడలు ఈ స్థాయికి చేరాయన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఐర్లాండ్, నెదార్లాండ్, కెన్యా, హంగేరి, నార్వే, ఉజ్బేకిస్తాన్‌లాంటి చిన్న చిన్న దేశాలు పతకాలు సాధించి, పతకాల పట్టికలో ఆగ్రభాగాన ఉంటే భారత్ మాత్రం ఆరు పతకాలతో 71వ స్థానంలో వుందంటే తీవ్రంగా కలిచివేసే అంశం. గతంలో ఎప్పుడు లేని విధంగా 117 మంది అథ్లెట్లతో పారిస్‌కు క్రీడకారులు వెళ్లిన అథ్లెట్లలో ఒక్క బంగారు పథకం సాధించని పరిస్థితి. 2020లో జపాన్ రాజధాని టోక్యలో జరిగిన 32వ ఒలంపిక్‌లో 7 పతకాలు భారత క్రీడాకారులు సాధిస్తే, పారిస్ 33 ఒలంపిక్‌లో ఒకటి రజతం, 5 కాంస్యం అంటే 6 పతకాలతో భారత క్రీడకారులు భారత గడ్డపై అడుగు పెట్టారు. 19 రోజుల పాటు పారిస్‌లో జరిగిన ఒలంపిక్స్‌లో 205 దేశాల అథ్లెట్లు, 32 క్రీడాంశాలు, 35 క్రీడ వేదికలో క్రీడలు నిర్వహించారు. 91 దేశాలు పతకాలు సాధిస్తే, భారత్ స్థానం 71 అంటే క్రీడాభిమానులకు తీవ్ర నిరాశ పర్చిందని చెప్పకతప్పదు. పతకాల పట్టికలో 126 పతకాలతో అమెరికా అగ్రభాగాన నిలువగా, 91 పతకాలతో చైనా రెండవ స్థానంలో, 45 పతకాలతో జపాన్ మూడవ స్థానం, 50 పతకాలతో ఆస్ట్రేలియా నాల్గవ స్థానం, 64 పతకాలతో ఫ్రాన్స్ ఐదవ స్థానంలో నిలిచాయి. న్యూజిలాండ్ 20, కెడా 27, ఉజ్బేకిస్తాన్ 13, హంగెరి 19, కెన్యా 11, నార్వే 8, ఐర్లాండ్ 7, పతకాలు సాధించి విశ్వ క్రీడ వేదికపై సత్తాచాటాయి.
మనకన్నా జనాభాలో తక్కువగా ఉన్న దేశాలు కూడా క్రీడల్లో రాణిస్తుండగా 140 కోట్ల జనాబా కలిగిన భారత్ క్రీడల్లో అదమ స్థానంలో ఉండటం ఒకింత అందోళనకరమైన అంశం.మనవా్లు ఒక్క స్వర్ణం లేకుండా పారిస్ నుంచి వెనుతిరగడమంటే అది క్రీడాకారుల తప్పుకాదు, క్రీడల్ని మొదటినుంచి ప్రోత్సహించని పాలకవర్గాలదే. అథ్లెట్ల్‌లో భారత క్రీడాకారులు నాల్గోవ స్థానంలో నిలువగా 2028లో జరిగే ఒలంపిక్‌లో జయభేరి మోగిస్తామన్నా భరోసా ఇవ్వగలిగారు. ”జావ్‌లిన్‌త్రోలో” నీరజ్ చోప్రా రజతం, రెజ్లింగ్‌లో అమన్ సేవ్రహావత్ కాంస్యం, షూటింగ్‌లో మనుభాకర్ కాంస్యం, హాకీలో కాంస్యం, షూటింగ్‌లో స్వప్నిలే కుశాల్ కాంస్యం పతకాలు సాధించారు. కేవలం షూటింగ్‌లో 3 కాంస్య పతకాలు దక్కడం విశేషం. రియో, టోక్యోలో జరిగిన ఒలింపిక్‌లో షూటింగ్‌లో ఒక్క పథకం సాధించలేకపోయినప్పటికి పారిస్‌లో మూడు పతకాలు సాధించి క్రీడాభిమానుల్లో కాస్త ఉత్తేజం నింపారు. టోక్యో రియోల్లో జరిగిన ఒలంపిక్స్‌లో భారత క్రీడకారులు టెన్నిస్‌లో మెరిసి పతకాలు సాధించగా, పారిస్‌లో నిరాశపర్చారు. గతంలో కంటే పారిస్ ఒలంపిక్స్‌లో క్రీడకారులు ప్రతిభ కనబర్చినప్పటికీ పతకాల పట్టికలో భాగా వెనుకబడిపోయారు. 2008, 2012, 2016, 2021లో అత్యంత ప్రతిభ కనబర్చి షూటింగ్‌లో పతకాలు సాధించినట్టుగానే పారిస్‌లో షూటింగ్‌లో ఏకంగా మూడు పతకాలు సాధించారు.
అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న అమెరికాకు చైనా అన్ని రంగాల్లో సవాల్ విసురుతోంది. పారిస్‌లో జరిగిన ఒలంపిక్స్‌తో సైతం 40 స్వర్ణాలు సాధించి చైనా అమెరికాకు సవాల్ విసిరింది. అమెరికా, చైనా చెరో 40 స్వర్ణాలతో మెరిశాయి. జపాన్ 20 స్వర్ణాలు సాధించి మూడవ స్థానంలో నిలిచింది. ఆరు పతకాలు సాధించి మనవాళ్లు సంతృప్తి కలిగించారా…నిరాశపర్చారా? అన్న ప్రశ్నలు వెలుగు చూస్తున్నాయి. క్రీడల్లో భారత స్థానం ఎక్కడుందన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఆసియా క్రీడల్లో రాణించిన తరహాలో ఒలంపిక్ క్రీడల్లో భారత క్రీడ దిగ్గజాలు ఎందుకు రాణించ బడలేదని క్రీడ పండితులు విశ్లేషణలు చేస్తున్నారు. క్రీడా రంగానికి నిధులు కేటాయించక పోవడమా? క్రీడా కారులకు నిరంతరం శిక్షణ ఇవ్వకపోవడమా, క్రీడల్లో రాజకీయ జోక్యం పెరిగి పోవడమా అన్న చర్చనడుస్తోంది. అన్ని రంగాలకు పాలకులు అంచనాలు పెంచుతారు కాని క్రీడలకు ఎందుకు బడ్జెట్ పెంచరని క్రీడాభిమానుల నుంచి ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ జోక్యం క్రీడల్లో పెచ్చు పెరిగిపోయిందని, ప్రతిభవంతులైన క్రీడాకారులను తొక్కి వేయడం వల్లనే విశ్వ క్రీడ పతకాల పట్టికలో దిగువ స్థాయికి పడిపోయామన్న వాదనాలు తెరపైకి వస్తున్నాయి. పారిస్ ఒలంపిక్స్‌లో సాధించిన పతకాలను చూసి పాలకు కనువిప్పు కలుగుతుందా? ఈ ఏడాది మన దేశ బడ్జెట్ అక్షరాల రూ.42 లక్షల కోట్లు. ఇందులో కేంద్రం క్రీడా రంగానికి ఏ మేరకు నిధులు కేటాయించిందనేది ప్రభుత్వమే పరిశీలన చేసుకోవాలి. పదహారేండ్ల వయసులోనే అమెరికా క్రీడాకారుడు క్వీన్సివిల్సన్ రన్నింగ్‌లో బంగారు పతకం సాధించడం మన దేశానికి ఒక సవాల్. యువకులు, చైతన్యవంతులు, సామర్థ్యంగలవారు, క్రీడల్లో రాణించగలిగే సత్తా ఉన్నవారు భారత్‌లో కూడా ఎక్కువే. కానీ వారిని గుర్తించి, ప్రతిభాపాటవాలను వెలికి తీయకపోవడం వల్లే పారిస్ పతకాల వేటలో మనం ఓడిపోయాం. ప్రభుత్వం ఇదో గుణపాఠంగా తీసుకుని క్రీడారంగం పట్ల శ్రద్ధ కనపరిచి, తగిన నిధులు కేటాయించి,క్రీడలను ప్రోత్సహిస్తే గనుక, భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించగలిగే ఆత్మస్థైర్యం క్రీడాకారుల్లో పెంపొందుతుంది.
– గుర్రం రాంమోహన్ రెడ్డి, 7981018644