కోమటిరెడ్డి గారూ.. కరోనా సమయంలో ఎక్కడ దాక్కున్నావు సార్

-మట్టి రోడ్డు  ఉన్నప్పుడు మత్తులో ఉన్నావు
-నల్లగొండను  పాలిస్తా అనేందుకు సిగ్గుండాలి 
-కోమటిరెడ్డి నామినేషన్ ర్యాలీపై కంచర్ల
 నవతెలంగాణ -నల్గొండ కలెక్టరేట్: కోమటిరెడ్డి గారూ.. కరోనా సమయంలో ఎక్కడ దాక్కున్నావు సార్. ఇక్కడ జనాలు రాకపోవడంతో..  జిల్లాలో 6 నియోజకవర్గాల నుంచి జనాలను       తీసుకొచ్చి షో చేస్తున్నావ్. ఎవడికి తెలియదు. కోమటన్నా.. నీ కమీషన్ల రాజకీయాలు అని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రేడ్డి విమర్శించారు.మంగళవారం కోమటిరెడ్డి వెంకటరెడ్డి నామినేషన్ ర్యాలీపై అయన  మాట్లాడారు. నల్గొండ ప్రజలు గెలిపిస్తే హైదరాబాద్ లో గడిపావు. తరిమికొడితే భువనగిరికి పారిపోయినవ్. నాయకులను పశువులను కొన్నట్లు కొనేందుకు నల్గొండ వచ్చినవు. నువ్వా మా నల్గొండను పాలిస్తా అనేందుకు సిగ్గుండాలి అని ధ్వజమెత్తారు. నల్గొండలో మట్టి రోడ్లున్నప్పుడు మత్తులో ఉన్నావు. సిమెంట్ రోడ్లొచ్చాక సిమెంట్ తినేందుకు వస్తున్నావు. అని  మండిపడ్డారు. నువ్వు నాయకులను కొనగలవేమో కానీ, ప్రజలకు కంచర్ల భూపాల్ రెడ్డి మీద ఉన్న అభిమానాన్ని కొనలేవని అన్నారు.