మహిళ సాధికారత ఎక్కడ ?

– బీఆర్ఎస్ లిస్టులో మహిళలందరూ..
– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దేవేందర్
నవతెలంగాణ- తాడ్వాయి
మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కావాలని ఢిల్లీలో దీక్ష చేసిన ఎమ్మెల్సీ కవిత, తన సొంత పార్టీలో మహిళా రిజర్వేషన్ ఏమైంది అని ? సొంత పార్టీలో మహిళా రిజర్వేషన్ ఎందుకు వర్తించలేదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్ ప్రశ్నించారు ?. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ కోసం ఢిల్లీలో దీక్ష చేసిన కవిత సొంత టిఆర్ఎస్ పార్టీలో ఎంతమంది మహిళలకు అసెంబ్లీ ఎన్నికల లో అవకాశం కల్పించారని మండిపడ్డారు. ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో ఒక ఆరుగురి మహిళలకి స్థానం కల్పిస్తే 33 శాతం రిజర్వేషన్ సరిపోతుందా అని సూటిగా ప్రశ్నించారు. వేరే పార్టీ విషయంలో దీక్షలు చేసే కల్వకుంట్ల కవిత వారి సొంత పార్టీలో మహిళలకు అన్యాయం జరిగితే దీక్ష ఎప్పుడు ప్రారంభిస్తారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా టిఆర్ఎస్ పార్టీలో 33% అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఇర్ప సునీల్ దొర, జిల్లా సీనియర్ నాయకులు అర్రెం లచ్చు పటేల్, గ్రామ కమిటీ అధ్యక్షులు పాక రాజేందర్, పిఎసిఎస్ మాజీ చైర్మన్ సాంబయ్య, డైరెక్టర్ యానాల సిద్ది రెడ్డి, నాయకులు ముక్తి రామస్వామి, సాధు చక్రపాణి, సూర్యం, శివానంద్, కుంజ నారాయణ, ఇర్ప వెంకటేశ్వర్లు, మల్లేష్, ప్రసాద్, కల్తి రమేష్ తదితరులు పాల్గొన్నారు.